Sajjala Ramakrishna Reddy: వాలంటీర్లపై తప్పుడు ప్రచారం.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, నాలుగు అయిదు నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది.. ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది..? అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉందన్న ఆయన.. వాళ్లను కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.. నలుగురు వ్యక్తులు వచ్చరని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు సజ్జల..
Read Also: Congress: రాయ్‌బరేలీ, అమేథీ సీట్లపై ఏకే.ఆంటోనీ కీలక వ్యాఖ్యలు
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ఇక, చంద్రబాబు రోజుకు ఒక మాట మారుస్తారు అని దుయ్యబట్టారు సజ్జల.. చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారన్న ఆయన.. వాలంటీర్ వ్యవస్థపై నమ్మకం ఉంటే.. ఇన్నాళ్లు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఏంటి? అని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తప్పుగా మాట్లాడారు.. తాము అధికారంలోకి వస్తే తీసివేస్తా అన్నారు.. ఇప్పుడు ఆ వ్యవస్థనే కొనసాగిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పిదారి అధికారంలోకి వస్తే ఇప్పడు ఉన్న వాలంటీర్లను తీసివేసి.. జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో ప్రజల తీర్పు ఇప్పటికే స్పష్టంగా ఉంది.. తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు.. రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రచారంలో ఉంటే అడిగే హక్కు టీడీపీకి ఎక్కడి? అని నిలదీశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!