KP Nagarjuna Reddy: వైసీపీ విజయానికి కృషి చేయాలి.. కాపులకు ఎమ్మెల్యే పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KP Nagarjuna Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందూరు నాగార్జునరెడ్డి.. ఈ సారి గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతోన్న విషయం తెలసిందే కాగా.. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలంటూ ఆయన కాపులకు పిలుపునిచ్చారు.. గురువారం సాయంత్రం గిద్దలూరు టౌన్ రంగారెడ్డి పల్లెలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో పలువురు బలిజ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బలిజ అత్మీయ సమావేశంలో పాల్గొన్నారు నాగార్జునరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Read Also: KRMB: నేడు కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ కీలక భేటీ.. తాగునీటి కేటాయింపులపై చర్చలు
Also Read
ఇక, ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు నాగార్జున రెడ్డి.. మరోసారి సేవ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తే గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి అహర్షిశలు కృషి చేస్తానని మాట ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బలిజ కుటుంబాలకు అండగా ఉంటా.. వారి వ్యాపారాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.. వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా అండగా ఉంటా.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి.. ఇక, ఈ కార్యక్రమంలో ముందుగా కాపు బలిజ ప్రముఖులు, సభ్యులు, నాగార్జున రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కుండూరు నాగార్జున రెడ్డిని, వారి సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డిని పలువురు బలిజ సంఘ సభ్యలు శాలువా, పూలమాలలతో సన్మానించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!