రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆరోపించిన జగన్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలు దిగజారాయి.. మొత్తం రెడ్‌బుక్ పరిపాలన నడుస్తోందని మండిపడ్డా.. చంద్రబాబు ఎంత భయపెట్టినా.. ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.. అయితే, వైసీపీ గెలిచినచోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు..
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఈ రోజు (ఏప్రిల్ 8న) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
వైఎస్ జగన్.. రాప్తాడు పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరోసారి తోపుదుర్తి సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె... జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రాప్తాడు వైసీపీ టికెట్ బీసీలకు ప్రకటించాలని డిమాండ్ చేశారు.. జగన్‌ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి.. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందన్నారు.. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుతున్నారు.. కానీ, మాకు సీఎం చంద్రబాబు ఇలాంటి…
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అప్పుడన్న మీరు జగన్ ను మించిపోయారు అప్పు తేవడంలో.. రాష్ట్ర అప్పుల పైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని.. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు అని చెప్పి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అప్పులు తెస్తున్నారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.
ఒకప్పుడు నెత్తుటేళ్ళు పారిన అనంతపురం జిల్లాలో మళ్లీ రక్త చరిత్ర టాపిక్ తెర మీదికి వచ్చింది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం లో జరిగిన ఒక హత్య దగ్గర మొదలైన మేటర్... ఫ్లాష్ బ్యాక్‌లో పరిటాల రవి మర్డర్ వరకు వెళ్తోంది. ఆ పాత గాయాలు మళ్లీ ఎందుకు రేగుతున్నాయి?
మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నారా లోకేష్ అవకాశం వచ్చినప్పుడల్లా స్థాయిని మించి మాట్లాడుతున్నారు.. వైఎస్ జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. కళ్లు నెత్తి మీదకి ఎక్కి... వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి లోకేష్ మాట్లాడుతున్నాడు.. లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకో.. 2019లో పార్టీ ఓడిపోవడానికి మీరు కూడా ఒక కారణం అని గుర్తుంచుకోండి..
సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి.. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెడతాడు. సమాజంలో ఉన్న 20 శాతం పేదవాళ్ల బాగోగులకు 10 శాతం మందికి అప్పగిస్తాడంట? రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?