ఇక బీజేపీతో తేల్చుకోవడానికే వైసీపీ సిద్ధమైందా? ఆ పార్టీ విషయంలో ఇంకా మెతగ్గా ఉంటే… మొదటికే మోసం వస్తుందని భయపడుతోందా? వక్ఫ్ బిల్లు విషయంలో సుప్రీం కోర్ట్ తలుపు తట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసింది ఫ్యాన్ పార్టీ? జరక్కూడనిదేదో జరిగిపోతోందని గుర్తించిందా? ఇంతకీ వైసీపీ భయం ఏంటి? ఆ పార్టీ యాక్షన్‌కి బీజేపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆవిర్బావం నుంచి జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ స్టాండ్‌తోనే ఉన్న వైసీపీ… ఇంత వరకు ఏ కూటమిలో చేరలేదు.…
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో మాజీ ముఖ్యమంత్రి, వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ విండో షీల్డ్ కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రాజధానిని స్మశానం అన్నారు.. ఈ రోజు స్వేచ్చా వాతావరణంలో మాట్లాడుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకూ భయంకరమైన వాతావరణం ఉంది.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు.. నేనుకూడా బయటకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు.. హెలికాప్టర్ లో వస్తే కింద ఉన్న చెట్లను నరికేశారు.
వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ దమ్ముతో అంబేడ్కర్ స్మృతి వనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉందన్నారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అంబేడ్కర్ ను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. లూలూ కంపెనీకి స్వరాజ్య మైదాన్ ను తాకట్టు పెట్టాలని చూసారు.. ఎందుకు అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా.. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో పళని స్వామి మాట్లాడుతూ.. రెండు…
అధికారంలోకి రావటానికి అప్పట్లో ఏమేమి ఎర వేశారో అందరికీ తెలుసు.. కానీ, ఎన్టీఆర్ లా అభిమన్యుడు కాదు జగన్.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్ని నాని.. జైల్లో ఉన్న సమయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబు.. జైల్లోకి వెళ్లగానే డీ హైడ్రేషన్.. అలర్జీ అన్నారు..
జగన్ హోల్ సేల్‌గా చేస్తే.. చంద్రబాబు రిటైల్‌గా చేస్తున్నాడు.. పెద్ద తేడా ఏమీ లేదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ప్రస్తుతం రాజకీయాల్లో నీచమైన భాష నడుస్తోంది.. పోలీసు అధికారులను జగన్ తిట్టారు.. మీరు అధికారంలో వున్నప్పుడు ఏం చేశారు..? అని ప్రశ్నించారు.. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసు లేకుండా అరెస్ట్ చేశారు... ఎంపీని ఇబ్బంది పెట్టారు..
వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని విమర్శించడానికి ఏపీ మంత్రులు ఎక్కువ మంది వెనకాడుతున్నారా? ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా… వీళ్ళు దీటుగా కౌంటర్స్ వేయలేకపోతున్నారా? ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళంతా ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళ వెనకడుగు వెనకున్న రీజనేంటి? ఆ విషయమై టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్ మెల్లిగా దూకుడు పెంచుతున్నారు. ప్రభుత్వం మీద విమర్శల వాడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన చేసిన కామెంట్స్…
ఈసారి కచ్చితంగా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. జగన్ 2.O పాలనలో మీకు కావాలనుకుంటున్న విధంగా జగన్ ను చూస్తారంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ పాత బీహార్ లా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు..