పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్.. 2023 - 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈరోజు పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులను పరామర్శించనున్నారు. శనివారం తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ సోమవారం ఉదయం 8.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంకు చేరుకుంటారు. నష్టపోయిన…
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (మార్చి 24) పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన లింగాల మండలంలో ఇటీవల తీవ్ర ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలించనున్నారు. రైతుల కష్టాలను నేరుగా తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు జగన్ ఈ పర్యటనకు సిద్ధమయ్యారు. Read Also: Water from air: గాలి నుంచి నీరు తయారు చేస్తున్న భారతీయ సంస్థ.. ఎలా సాధ్యం..? పర్యటన వివరాల…
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. కానీ... తీరా శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో త్రిమూర్తులు ఏ వైపు ఉన్నారు?
దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశంపై ఉత్తరాది.. దక్షిణాదిల మధ్య గంభీరమైన వాతవరణం నెలకొంది. చెన్నై కేంద్రంగా డీఎంకే ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కి సౌత్ సీఎంలు, పలు రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని డీఎంకే ప్రతినిధులు వైసీపీని కూడా ఆహ్వానించారు. జగన్ గతంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు పలికాయి.
Bala Veeranjaneya Swami: పేర్ని నాని, వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వాళ్ల లాగా 11 సీట్లకు పరిమితం కావాల్సిన అవసరం మాకు లేదు.. పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమయ్యాయి.
YS Jagan: డీలిమిటేషన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉంది.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోంది.
Minister Nara Lokesh: ప్రభుత్వం శాశ్వతం.. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం అని ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంసపాలనతో బ్రేక్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే ఎక్కువగా... వలసల మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోందట. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వన్ బై వన్ కీలక నేతలు సైతం బైబై చెబుతుండటం, అందుకు అధిష్టానం నుంచి కనీస స్పందన లేకపోవడం గురించి నాయకులంతా తెగ చెవులు కొరికేసుకుంటున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని, మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు లాంటి ముఖ్య నాయకులతోపాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి,…