Adurs 2: చారి ఈజ్ బ్యాక్.. ‘అదుర్స్ 2’ స్క్రిప్ట్ రెడీ.. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adurs 2: తెలుగు సినిమా చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్‌కు కొన్ని ప్రత్యేక పేజీలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో యంగ్ టైగర్ కెరీర్‌లో గ్రేటెస్ట్ హిట్‌లలో ఒకటైన ‘అదుర్స్’కు సీక్వెల్ గురించి పలు ఆసక్తికరమైన ముచ్చట్లు జూనియర్ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. ఈ సినిమా వల్లభనేని వంశీ నిర్మించారు. 2010 లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డబుల్ రోల్‌లో నటించిన ఈ మూవీలో షీలా మరో హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికీ కూడా ఒక మాస్టర్ పీస్. ఈ సినిమాలో చారి, బట్టు మధ్య వచ్చే కామెడీ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్.. డైలాగ్ టూ డైలాగ్ చెప్పే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం.
READ ALSO: INS vs PAK T20 World Cup: ‘‘టీమిండియా ఇష్టం’’.. హ్యాండ్ షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్..
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
తాజాగా ఒక సినిమా ఈవెంట్‌లో కోనా వెంకట్ మాట్లాడుతూ.. ‘అదుర్స్’ సీక్వెల్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు ప్రాజెక్ట్‌లతో బీజీగా ఉన్నారని అన్నారు. ఇటీవల వివి వినాయక్‌ను కలిస్తే ‘అదుర్స్’ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ గురించి అడిగినట్లు చెప్పారు. స్క్రిప్ట్ రెడీ అయ్యిందని, ఎన్టీఆర్ ఫ్రీగా అయిన తర్వాత కలిసి ఆయనతో ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తామన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి 2010 లో రిలీజ్ అయిన అదుర్స్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. అదుర్స్ చిత్రానికి కోన వెంకట్ కథను అందించారు. వి.వి. వినాయక్‌తో కలిసి ఆయన స్క్రీన్‌ప్లేలో కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా ‘అదుర్స్ 2’ గురించి అప్డేడ్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు, కామెడీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్ ‘అదుర్స్ 2’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది. ప్రస్తుతం యంగ్ టైగర్ ప్రశాంత్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తుండగా, దాని తర్వాత దేవర 2 చేయబోతున్నారని సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తి అయిన తర్వాత ‘అదుర్స్ 2’ కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది ఏమో వేచి చూడాలి. ఏదేమైనా చారి ఈజ్ బ్యాక్ అంటే థియేటర్స్‌లో మామూలుగా ఉండదు.
READ ALSO: Millet Breakfast: ఈ చిరుధాన్యాల బ్రేక్‌ఫాస్ట్‌తో రోజంతా ఫుల్ ఎనర్జీ!
తాజావార్తలు
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!