వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలంటే... యుగాంతం అయిపోవాలి అంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.. ఓ మాజీ సీఎం.. పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం ఎంతవరకు కరెక్ట్? అని నిలదీశారు.
ప్రతీ చర్యకు.. ప్రతిచర్య ఉంటుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడే, అంతే వేగంతో అదిపైకి లేస్తుందన్నారు.. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని హెచ్చరించారు..
విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం.. ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లాం.. ఆ ప్రస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఆరోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన…
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు సమావేశం కానున్నారు. కర్నూలు, నంద్యాల చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు సమావేశంలో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ నిర్వహించే సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ…
మాజీ సీఎం గనుక వైఎస్ జగన్కు భద్రత ఇచ్చాం.. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
నిన్నటి జగన్ టూర్ డ్రామాను తలపించింది.. ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు వ్యవహరించారని విమర్శించారు.. ఇక, జగన్ పర్యటన కోసం 1100 మంది పోలీసులను పెట్టాం.. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియా.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం..
జగన్ హెలికాప్టర్ విండ్షీల్డ్ ధ్వంసంపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.. కుట్రపూరితంగానే పోలీస్ భద్రతను తొలగించారా? అని ప్రశ్నిస్తోంది.. వైఎస్ జగన్ భద్రతపై ప్రతిసారీ ఇదే నిర్లక్ష్యం అంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా సమాచారం ఇచ్చే జగన్ రామగిరికి వెళ్లారు.. మాజీ సీఎంకు కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? ఆయన ప్రతి పర్యటనలోనూ పోలీసుల తీరు ఇదే రకంగా ఉంది.. కూటమి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు.. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజీ అయ్యింది.. జగన్ వస్తున్నాడని తెలిసి.. భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు.. ఇక, హెలిప్యాడ్ దగ్గర జగన్ వచ్చిన హెలికాప్టర్ దిగగానే.. దాని మీదకు దూసుకుపోయారు.. దీంతో.. స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది..