TDP: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆయన సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్తపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో.. వైసీపీ శ్రేణులు కిరణ్‌ను టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు.. అయితే, భారతిపై కిరణ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ.. వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది..
Read Also: Vishwambhara : విశ్వంభర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది.. కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం.. ఇక, చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. టీడీపీ ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఏ క్షణంలోనైనా కిరణ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.. అయితే, తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. పార్టీ అధిష్టానం కూడా సీరియస్ కావడంతో.. తప్పు చేశానని తెలుసుకున్న చేబ్రోలు కిరణ్.. క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని.. తనను క్షమించాలని కోరుతో ఓ వీడియో విడుదల చేశాడు.. వైఎస్ జగన్, వైఎస్ భారతికి క్షమాపణ చెప్పిన కిరణ్.. భారతమ్మ కాళ్లు పట్టుకొని నేను క్షమాపణ కోరతానంటూ వ్యాఖ్యానించాడు.