ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు సమావేశం కానున్నారు. కర్నూలు, నంద్యాల చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లు సమావేశంలో పాల్గొననున్నారు.
వైఎస్ జగన్ నిర్వహించే సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. వైసీపీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.