YS Jagan: ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.
అధికార కూటమి పార్టీల వేధింపులను తట్టుకుని నిలబడిన ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రేపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా భేటీకాబోతున్నారు..
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో గత రెండు రోజుల క్రితం హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్ది పరామర్శించారు.
వైసీపీ అధినేత జగన్కు తత్వం పూర్తిగా బోధపడిందా? పార్టీ హైకమాండ్కు రియాలిటీ ఏంటో తెలిసి వచ్చిందా? నిన్నటి ఎంపీపీ ఎన్నికలతో బొమ్మ క్లియరైందా? మన వాళ్ళు ఎవరు? కాని వాళ్ళు ఎవరన్న సంగతి జగన్కు తెలిసివచ్చిందా? ఇంతకీ ఏం జరిగింది? ఏ విషయంలో పిక్చర్ క్లియరైంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది.చిన్న చితకా పార్టీ కార్యక్రమాలైతే… ముఖ్య నేతలతో సంబంధం లేకుండా స్థానిక నాయకులు చేసుకుపోతుంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు…
YS Jagan: ప్రంపచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
Minister Narayana: నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేశాం.. కానీ, గత వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు.
జగన్ పాలనలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది.. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ప్రజాధానం వృధా అయిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అలాగే, గత ప్రభుత్వంలో పోలవరానికి వచ్చిన డబ్బులు దారి మళ్లించారు.. దాని వల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అని జగన్ ప్రశ్నించారు.
ఏపీలో లేని లిక్కర్ స్కాం పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని.. ఇప్పుడు ఆయనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో…