కరోనా థర్డ్‌వేవ్ సన్నద్ధత పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… మూడోవేవ్ వస్తుందన్న సమాచారంతో గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్రతమతగా ఉండాలి అని కలెక్టర్లకు స్పష్టం చేశారు, థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో తెలియదు కానీ , మనం అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల వారీ ప్రణాళికల ప్రకారం ఆగస్టు చివరినాటికి అన్నిరకాలుగా సిద్ధం కావాలి. ఆస్పత్రుల్లో అవసరాలమేరకు మౌలిక సదుపాయాలను, ఆక్సిజన్‌బెడ్లను పెంచుకోవాలి అని సూచించారు. అన్నిరకాలుగా మందులు, బయోమెడికల్ ఎక్విప్మెంట్లను సిద్ధంచేసుకోవాలి. స్టాఫ్ నర్సులకు పీడియాట్రిక్…
స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారుల పని తీరు పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ… గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలి. వీటి సమర్థ మెరుగుపడాలంటే ఇనస్పెక్షన్ జరగాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్కలెక్టర్లు ఇనస్పెక్షన్లు చేయాలి. వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి 4 సార్లు…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించి.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దిన్.. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్,…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్‌కు వెళ్లారు.. స్పిల్వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్‌వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో…
ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం… 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపరిశీలన తర్వాత 12 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం. అయితే ఈ నెల 14నే పోలవరంకి వెళ్ళాల్సి ఉన్నా… వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.…
ఏపీ సీఎం రాజ్యాంగ అతీతుడిలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావ్. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉంది ప్రభుత్వ వైఖరి. ఆరువేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. గతంలో దూరంగా ఉండి మా నిరసన తెలిపేవాళ్లం. ఈరోజు కలెక్టరేట్ గేటు వరకూ వచ్చాం…రేపు కలెక్టర్ ఆఫీస్ వరకూ వెళ్తాం. ఎన్నికలు దగ్గరపడితే…
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.. దాదాపుగా నామినేటెడ్ పదవుల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందని… రేపే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ప్రచారం సాగుతోంది.. బుధవారం రోజు 60 నుంచి 70 వరకు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉండగా.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన, పలు కారణాలతో టికెట్ పొందని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్… ఇప్పటి వరకు ప్రముఖంగా వినిపిస్తున్న కొన్ని పేర్లను పరిశీలిస్తే..…