ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించి.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దిన్.. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్,…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్కు వెళ్లారు.. స్పిల్వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో…
ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం… 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపరిశీలన తర్వాత 12 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం. అయితే ఈ నెల 14నే పోలవరంకి వెళ్ళాల్సి ఉన్నా… వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.…
ఏపీ సీఎం రాజ్యాంగ అతీతుడిలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావ్. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉంది ప్రభుత్వ వైఖరి. ఆరువేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. గతంలో దూరంగా ఉండి మా నిరసన తెలిపేవాళ్లం. ఈరోజు కలెక్టరేట్ గేటు వరకూ వచ్చాం…రేపు కలెక్టర్ ఆఫీస్ వరకూ వెళ్తాం. ఎన్నికలు దగ్గరపడితే…
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.. దాదాపుగా నామినేటెడ్ పదవుల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందని… రేపే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ప్రచారం సాగుతోంది.. బుధవారం రోజు 60 నుంచి 70 వరకు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉండగా.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన, పలు కారణాలతో టికెట్ పొందని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్… ఇప్పటి వరకు ప్రముఖంగా వినిపిస్తున్న కొన్ని పేర్లను పరిశీలిస్తే..…
తెలంగాణ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యేలు కోవర్టులుగా పనిచేస్తున్నారు. టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రాసిన లేఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని అన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థనరెడ్డి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లేఖ రాసిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలాను యదేచ్చగా వాడటం వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనుకూడా పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్ళకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్న సీఎం నోరు మెదపటం…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తోంది.. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. పూర్తి చేసిన పనులను పరిశీలించి.. ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను నుంచి సమాచారం తీసుకుని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇక, మరోసారి పోలరవం ప్రాజెక్టు డ్యామ్ సైట్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్.. ఈ నెల14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు పోలవరం ప్రాజెక్టుకు…
తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా నాయకత్వాలు, పార్టీల పాత్రలూ ప్రవేశ నిష్క్రమణలూ జరగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటి ప్రభావం ఎలా వుంటుందనేదానిపై ఎవరి అంచనాలు వారికి వుంటాయి గాని మార్పు తథ్యం. పైగా ఇవన్నీ ఒకటి రెండు రోజుల తేడాతో జరగడం మరీ విశేషం. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చాలా కాలం తర్వాత గాంధీ భవన్ కళకళలాడింది. ఆ మరుసటి రోజునే వైఎస్ జయంతి…
కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశం ముగిసింది.. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై చర్చించారు నేతలు.. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ, తెలంగాణ సీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు.. కేసీఆర్, జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని కామెంట్ చేసిన ఆయన.. రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారు.. పగలు ఉత్తరాలు రాస్తారంటూ విమర్శించారు.. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం రోజున కేసీఆర్ చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి.. ఏపీ,…