ఇవ్వాల్సిన సమయానికి సెకండ్ డోస్ వేయకపోతే వ్యాక్సిన్ వృథా అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్‌కు పరిష్కారం అన్నారు.. వ్యాక్సినేషన్లో ఇంకా చాలాదూరం మనం వెళ్లాల్సి ఉందన్న ఆయన.. సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. అసలు ఇవ్వాల్సిన టైంలో వారికి సెకండ్‌డోస్ ఇవ్వకపోతే వ్యాక్సిన్ వృథా అవుతుందని సూచించారు.. 45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయితే.. మిగిలిన కేటగిరీలపై దృష్టిపెట్టాలని…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాయలసీమలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం పర్యటన ఉంటుంది. జూలై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆర్బీకే ప్రారంభించటంతో పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు.…
తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసీఆర్ దోపిడీని బయటపెడతామని.. అయన శేషజీవితాన్ని జైల్లో గడపాల్సిందేనని వ్యాఖ్యానించారు.. ప్రజలు ఎదురు తిరిగే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించిన ఆయన.. శిశుపాలుడి పాపాల కంటే కేసీఆర్ పాపాలే ఎక్కువయ్యాయని కామెంట్ చేశారు.. తప్పుడు సమాచారం ఇచ్చే సన్నాసిని మాత్రం నేను కానని.. మీరే కాదు.. మీ ఇంజనీర్లు కూడా 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు చూపించాలని…
తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ సాగుతోన్న సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారాయణ స్వామి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మంచి ఆలోచన అభిమానంతో ఆంధ్రకి సహకరిస్తామన్నారు.. రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రజలు తల్లిబిడ్డలు కలిసి ఉన్నారని… సీఎం జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అభిమానం.. కేసీఆర్‌కి కూడా జగన్…
వైఎస్ఆర్ భీమా పథకాన్ని ఈరోజు తాడెపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో కుటుంబపెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్టు జగన్ తెలిపారు. 2021-22 సంవత్సరానికి రూ.750 కోట్ల రూపాయలతో భీమా రక్షణ కల్పిస్తున్నట్టు వైఎస్ పేర్కొన్నారు. పేదలపై ఎలాంటి భారం పడకుండా భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు జగన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని తెలిపారు. కుటుంబ పెద్ద చనిపోతే, ఆ కుటుంబానికి భీమాతో…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది… ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది… సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్నినాని.. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు… ఏపీ కేబినెట్ నిర్ణయాలు: వైఎస్సార్ జయంతి జులై 8వ తేదీన భారీ ఎత్తున రైతు దినోత్సవ కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో వెటర్నరీ అంబులెన్సుల…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నది. ముఖ్యమంత్రి సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించబోతున్నారు. తెలంగాణతో ఉన్న జలవివాదం గురించి ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఏపీలో ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్నది. …
ఏపీ ప్రభుత్వం గతెడాది ఫిబ్రవరిలో దిశాయాప్‌ను రూపోందించి విడుదల చేసింది. దీనికి సంబందించి చట్టాన్ని, దిశా పోలీస్ స్టేషన్లను కూడా తీసుకొచ్చింది. దిశా యాప్‌పై విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రతి మహిళ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇక ఈ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి… ఎలా ఉపయోగించాలో చూద్దాం. Read: అర్జున్ “ఆంజనేయస్వామి గుడి” ప్రారంభం..జులై 1న కుంభాభిషేకం. దిశాయాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్…