వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. సిబ్బంది కొరతలేని ప్రభుత్వాసుపత్రి దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటుంది సర్కార్.. అందులో భాగంగా సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.. అక్టోబర్ నుంచి ప్రక్రియను ప్రారంభించి.. నవంబర్ 15 నాటికి ముగించాలన్న ప్లాన్‌కు సీఎం ఆమోదం తెలిపారు.. వైద్య ఆరోగ్యశాఖపై ఇవాళ…
సీఎం జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా ఆయన రాష్ట్రమంతా చేసిన పాదయాత్రనే. జనంలో ఉన్నాడు కాబట్టే గెలిచాడంటారు. అందుకే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కారు పాలన కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. నాడు ఇచ్చిన హామీలతోపాటు ఎన్నికలను మేనిపెస్టోనూ తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. దీంతో ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం…
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు…
సినిమా టికెట్లు ప్రభుత్వమే విక్రయించడం పై కాపు ఉద్యమనేత ముద్రగడ సీఎం జగన్ కు లేఖ రాసారు. అయితే సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించడం మంచిదే అని చెప్పిన ఆయన… మాజీ సినిమా ఎగ్జిబిటర్ గా మరికొన్ని సూచనలు చేస్తున్నాను అని తెలిపారు. సినిమా టిక్కెట్ల తరహాలోనే హీరో,హీరోయిన్ల పారితోషకాలు ఆన్ లైన్ లోనే చెల్లించాలి. సినిమాకు చేసే ఖర్చును నిర్మాత నుంచి ప్రభుత్వం ముందుగా బ్యాంక్ లో జమ చేయించుకోవాలి. ప్రభుత్వం ద్వారానే…
ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అఖండమైన విజయం సాధించింది. ఈ విజయం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ విజయం తన బాధ్యతను మరింత పెరిగిందని, గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉంటానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి ఇప్పుడు జరిగిన పరిషత్ ఎన్నికల వరకూ అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం,…
అక్టోబర్ 11న ఆంధ్ర సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. అయితే తిరుమలలో అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందు భాగంగా 11 రాత్రి జరగనున్న గరుడ సేవ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు సీఎం జగన్. అదే రోజు అలిపిరి వద్ద 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గో మందిరం….తిరుమలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ…
ఆంధ్రప్రదేశ్‌కు మరో 30 సంవత్సరాలపాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.. ఎవ్వరు ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ రఘురామకృష్ణంరాజు చేత బెయిల్ రద్దు పిటిషన్ వేయించింది చంద్రబాబేనని ఆరోపించారు.. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరన్నారు.. స్థానిక సంస్థల…
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.. 40 అంశాల అజెండాతో జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించనున్న మంత్రి వర్గం.. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు చేయనుంది.. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుపై చర్చజరగనుండగా.. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై ఈ అథారిటీ…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం 12.30 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రానున్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఒంటి గంట ప్రాంతంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం టీటీడీ విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను గతంలో ప్రసంశించారు సుబ్రహ్మణ్యం స్వామి. అయితే టీటీడీ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు…
చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు మరియు ఇతరులతో సహా టాలీవుడ్ ప్రముఖుల బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం గత వారం ఆగస్టులో జరగాల్సి ఉన్నప్పటికీ, తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఏపీ సిఎం ఆఫీస్ ఎట్టకేలకు సినీ పెద్దలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఈ అత్యున్నత సమావేశం సెప్టెంబర్ 20న జరుగుతుంది. అదే విధంగా…