ఇక క్షేత్రస్థాయి పర్యటనలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు, దిశా యాప్, వ్యవసాయం, అక్టోబరులో నెలలో అమలు చేయనున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు.
ఇక, ఇళ్లపట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్ కేసులపై దృష్టిపెట్టాలన్నారు సీఎం వైఎస్ జగన్.. గత వీడియో కాన్ఫరెన్స్‌లో 834 కేసులు ఉంటే.. ఇవాళ్టికి 758కి కేసులు తగ్గాయని.. 76 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు.. దాదాపుగా 8వేల మందికి దీనివల్ల మేలు జరిగిందన్న సీఎం.. ఏజీతో నేను కూడా రెగ్యులర్‌గా మాట్లాడుతున్నానని.. ఈ కేసులు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలిన అడిగినట్టు వెల్లడించారు.. వచ్చే నెలరోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నా అన్నారు. లే అవుట్ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశామన్న ఆయన.. మిగిలిపోయిన 12.6శాతం మ్యాపింగ్ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. 1980 నుంచి 2011 వరకూ ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా అవకాశం ఇస్తున్నాం.. ఆ ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయన్నారు.. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15. 6 లక్షల ఇళ్లు కడుతున్నాం.. ఇప్పటి వరకు 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్‌అయ్యాయని.. ఆప్షన్ –3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి మొదలుపెట్టడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారని.. ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలన్నారు.
Also Read
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!