అక్టోబర్ 11న ఆంధ్ర సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. అయితే తిరుమలలో అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందు భాగంగా 11 రాత్రి జరగనున్న గరుడ సేవ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు సీఎం జగన్. అదే రోజు అలిపిరి వద్ద 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గో మందిరం….తిరుమలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ పోటును ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. గో మందిరంకు 13 కోట్లు విరాళంగా మాజీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి అందించగా… అదనపు పోటుకు 20 కోట్లు విరాళంగా అందించారు పాలకమండలి సభ్యుడు శ్రీనివాసన్.