చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు మరియు ఇతరులతో సహా టాలీవుడ్ ప్రముఖుల బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం గత వారం ఆగస్టులో జరగాల్సి ఉన్నప్పటికీ, తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే ఏపీ సిఎం ఆఫీస్ ఎట్టకేలకు సినీ పెద్దలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఈ అత్యున్నత సమావేశం సెప్టెంబర్ 20న జరుగుతుంది. అదే విధంగా రాష్ట్ర ఐ అండ్ బి మంత్రి పెర్ని నాని ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి తెలియజేసినట్టు సమాచారం.
Read Also : సెకండ్ వీక్ సైతం నామినేట్ అయిన ఆర్జే కాజల్!
భారీ బడ్జెట్ సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి, పట్టణాలు, నగరాల్లో రోజుకు 5 షోలకు అనుమతి, రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్ రేట్లపై పరిమితిని అమలు చేయవద్దని అభ్యర్థించడం, ఇంకా పలు ఇండస్ట్రీ సమస్యల గురించి సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. సినిమా టిక్కెట్ బుకింగ్‌ల కోసం పోర్టల్‌ను ప్రారంభించడానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలను కూడా ఈ బృందం సీఎంతో చర్చిస్తుంది.