ఆంధ్రప్రదేశ్‌కు మరో 30 సంవత్సరాలపాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.. ఎవ్వరు ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ రఘురామకృష్ణంరాజు చేత బెయిల్ రద్దు పిటిషన్ వేయించింది చంద్రబాబేనని ఆరోపించారు.. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరన్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటానికి కారణం కూడా చంద్రబాబేనని విమర్శించిన ప్రసన్నకుమార్ రెడ్డి.. జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎప్పుడో ఎలక్షన్ అయిపోయి.. వాళ్లు కూడా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా కొనసాగే వారని.. కానీ, బాబు కారణంగానే ఈ పరిస్థి వచ్చిందన్నారు.. ఇక, ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు కాదు కదా ఎవరు ఏమి చేయలేరన్నారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.