సినిమా టికెట్లు ప్రభుత్వమే విక్రయించడం పై కాపు ఉద్యమనేత ముద్రగడ సీఎం జగన్ కు లేఖ రాసారు. అయితే సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించడం మంచిదే అని చెప్పిన ఆయన… మాజీ సినిమా ఎగ్జిబిటర్ గా మరికొన్ని సూచనలు చేస్తున్నాను అని తెలిపారు. సినిమా టిక్కెట్ల తరహాలోనే హీరో,హీరోయిన్ల పారితోషకాలు ఆన్ లైన్ లోనే చెల్లించాలి. సినిమాకు చేసే ఖర్చును నిర్మాత నుంచి ప్రభుత్వం ముందుగా బ్యాంక్ లో జమ చేయించుకోవాలి. ప్రభుత్వం ద్వారానే సినిమా నటులు, టెక్నీషియన్ల బ్యాంక్ అకౌంట్లకు నగదు పంపాలి అలాచేస్తే సినిమారంగంలో బ్లాక్ మనీ తగ్గుతుంది అని తెలిపారు. ప్రముఖ సినీనటుల సూచనతోపాటు తన సూచన కూడా పరిగణించాలని లేఖలో సీఎం జగన్ ను కోరారు ఉద్యమనేత ముద్రగడ.