Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఫస్ట్ పార్ట్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో పూర్తి స్థాయిలో అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు బాలయ్య. ఇందుకోసం ఆయన లుక్ ఎంతలా మార్చుకున్నారో మనం చూశాం కదా. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు దేశ వ్యాప్తంగా…
Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ2. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు. అఖండ2 సినిమా ప్రమోషన్లను పాన్ ఇండియా వైడ్ గా చేస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ టీమ్ నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను…
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌లను ‘‘పప్పు, తప్పు, అక్కు’’గా ప్రస్తావించారు.
Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాలు, పట్టణాల పేర్లను మార్చారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామ పేరును ‘‘కబీర్ ధామ్’’గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకున్నట్లు సీఎం యోగి చెప్పారు.
Rajnath Singh: పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని శనివారం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశానికి విజయం ఒక అలవాటుగా మారిందని నిరూపణ అయిందని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లో కలిసి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. Read Also: Shubman Gill:…
BrahMos: స్వదేశీ టెక్నాలజీ, ఆత్మ నిర్భర భారత్‌లో కీలక మైలురాయికి చేరుకుంది. కొత్తగా లక్నోలో ప్రారంభించిన ఫెసిలిటీతో తయారైన ‘‘బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి’’ మొదటి బ్యాచ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జరగబోయే వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు హాజరుకానున్నారు.
Yogi Adityanath: దీపావళికి ముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే జైలు పాలు కావడం ఖాయమన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని.. వెంటనే జైలులో పెడతామని హెచ్చరించారు. పండుగలు, వేడుకలను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని సీఎం యోగి సూచించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సమాజిక వర్గాలకు చెందిన ప్రజలు పండుగలను శాంతియుతంగా జరుపుకున్నారన్నారు. ఇది అల్లర్లకు తలొగ్గే ప్రభుత్వం కాదన్నారు.
దీపావళి వస్తుందంటే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తూ ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు కూడా గిఫ్టులు ఇస్తూ ఉద్యోగుల ఆనందంలో పాలుపంచుకుంటాయి. తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి శుభ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగులకు బహుమతిని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోనస్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల కృషి, అంకితభావానికి రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతను సూచిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతిలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వం ప్రతి…
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్‌లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.
Mayawati: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి గురువారం ప్రశంసలు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), తన ప్రభుత్వ హమాంలో నిర్మించిన సంస్థలు, దళిత స్మారక చిహ్నాల నిర్వహణ విషయంలో అఖిలేష్ యాదవ్ రెండు ముఖాలతో వ్యహరించారని విమర్శించారు.