Pooja Pal: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయి. ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించడంతో.. సమాజవాదీ పార్టీ (సపా) నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే పూజా పాల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తన హత్య జరిగితే దానికి బాధ్యులు మాత్రం సపా, పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అవుతారని ఆమె స్పష్టంగా ఆరోపించారు. ఈ విషయమై పూజా పాల మాట్లాడుతూ.. నేను అసెంబ్లీలో సీఎం యోగిని ప్రశంసించాను. అహ్మద్‌ను మాఫియా అని…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైన పాపులారిటీ ఉంది. యూపీలో సంచలన నిర్ణయాలను అమలు చేస్తూ సీఎం యోగి పాపులర్ అయ్యారు . అయితే ఇంతకాలం యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలను బిజెపి కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు మెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించారు. ఆయన పాలనను పొగడ్తలతో అసెంబ్లీ వేదికగా ముంచేస్తారు. మా పార్టీలో గెలిసి మేం…
Malegaon blast case: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ను ఎన్ఐఏ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ATS) తనను తీవ్రంగా హింసించిందని బీజేపీ మాజీ ఎంపీ ఆరోపించింది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేవని చెప్పింది.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు ఈ పదవిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును యోగి అధిగమించారు. పంత్ యూపీకి ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 127 రోజులను యోగి అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు.
Chhangur Baba: జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడిలు చేస్తున్న ముఠాకు కీలకంగా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడవుతోంది. హిందూ, సిక్కు మహిళలే లక్ష్యంగా భారీ మతమార్పిడి నెట్వర్క్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా మాధ్‌పూర్‌కు చెందిన జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబాగా పిలిచే వ్యక్తి అసలు నిజ స్వరూపం వెలుగులోకి వస్తోంది. మతమార్పిడే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్‌ని కలిగి ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఏకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ‘లవ్ జిహాద్’ కోసం ఆపరేట్ చేస్తున్నట్లు తెలిసింది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న గ్రామంలోని ఛంగూర్ బాబాకు చెందిన విలాసవంతమైన భవనంలో సోదాలు చేయగా, విస్తూ పోయే విషయాలు…
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మత మార్పిడిలే లక్ష్యంగా ఈ ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు యూపీ పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల నిధులు సంపాదించాడు. ముఖ్యంగా 40 బ్యాంక్ అకౌంట్లలో రూ. 106 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని రేఖా గుప్తా కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందని.. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రకరకాల రూమర్లు వస్తున్నాయి. కొందరేమో ఏపీలో నిర్వహిస్తారని చెబుతుంటే.. ఇంకొందరు హైదరాబాద్ లో ఉంటుందని అంటున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈవెంట్ ను వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో మూవీకి బజ్ క్రియేట్ చేయడం కోసం అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారంట. హిందువులపై జరిగే దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడే యోధుడి పాత్రలో పవన్…
Yogi Adityanath: కన్వర్ యాత్రకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (జూన్ 26న) కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడుకోవడంతో పాటు భక్తుల మనోభావాలను గౌరవించడం అవసరమని నొక్కి చెప్పారు.