Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌లను ‘‘పప్పు, తప్పు, అక్కు’’గా ప్రస్తావించారు. బీహార్‌లోని దర్భంగాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న యోగి, వీరిని మూడు కోతులుగా పిలిచారు. ‘‘మహాత్మా గాంధీ చెప్పినట్లు మూడు కోతులు ఉన్నట్లే, నేడు ఇండియా కూటమి పప్పు, తప్పు, అక్కు (రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్) పేరుతో మూడు కోతులను తీసుకువచ్చింది. పప్పు నిజం మాట్లాడలేడు, మంచి ఏమీ చెప్పలేడు. తప్పు ఏ సత్యాన్ని చూడలేడు, అప్పు నిజం వినలేడు’’ అని ఆయన అన్నారు.
Read Also: Shocking: “లైట్” కోసం గొడవ, మేనేజర్‌ను చంపిన టెక్నీషియన్..
బీహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌పార్టీలు నేరస్తుల్ని కౌగిలించుకుంటుందని, చొరబాటుదారుల్ని అనుమతించి రాష్ట్ర భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ఆరోపించారు. ఈ ఇండీ కూటమి నేతలు ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన మంచి పనుల్ని చూడలేదరని అన్నారు. ప్రతిపక్షాలు కలం ఆధారంగా ప్రజల్ని విభజిస్తున్నాయని యోగి ఆరోపించారు. తుపాకులు, పిస్టళ్లతో బీహార్ వ్యవస్థకు కళంకం తీసుకువచ్చారని ఆర్జేడీ పాలనపై మండిపడ్డారు. వీరంతా బహిరంగ హిందూ ద్రోహులు, రామ ద్రోహులు, జానకీ మాత వ్యతిరేకులు అని దుయ్యబట్టారు.