Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఫస్ట్ పార్ట్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో పూర్తి స్థాయిలో అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు బాలయ్య. ఇందుకోసం ఆయన లుక్ ఎంతలా మార్చుకున్నారో మనం చూశాం కదా. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు దేశ వ్యాప్తంగా చేయాలని బాలయ్య, బోయపాటి అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే మొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను కలిశారు. ఇప్పుడు రెండు భారీ ఈవెంట్ లు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : Andhra King Taluka : భాగ్య శ్రీతో డేటింగ్ పై స్పందించిన రామ్ పోతినేని
హైదరాబాద్ లో నిర్వహించే ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారంట. ఇప్పటికే ఆయన రావడం కూడా ఓకే అయిందని.. త్వరలోనే అధికారిక అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. అటు వారణాసిలో భారీ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. దానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఎలాగూ హిందూత్వం, సనాతన ధర్మం గురించే సినిమా తీసుకొస్తున్నారు కాబట్టి యోగి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇలా ఇద్దరు సీఎంలు గనక వస్తే మూవీకి హైప్ ఓ రేంజ్ లో వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : NBK : అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి