Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ2. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు. అఖండ2 సినిమా ప్రమోషన్లను పాన్ ఇండియా వైడ్ గా చేస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ టీమ్ నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. ఉత్తరాదిలో మూవీని ప్రమోట్ చేయాలని ఆయన్ను కలిసినట్టు తెలుస్తోంది.
Read Also : The Rajasaab : రాజాసాబ్ నుంచి ‘రెబల్ సాబ్’ సాంగ్ రిలీజ్
ఈ సందర్భంగా మూవీలో వాడిన త్రిశూలంను యోగికి గిఫ్ట్ గా ఇచ్చారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను, సంయుక్త మీనన్ ఇందులో ఉన్నారు. మూవీకి యోగి ఆదిత్యనాథ్ బెస్ట్ విషెస్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన టీజర్ తో పాటు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో అదరగొట్టబోతున్నాడని అంటున్నారు. అందుకే ఈ సినిమాను నార్త్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే నార్త్ లో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Spirit : ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదేనా !