పవన్ కళ్యాణ్ అనే వాడు నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టలేక రూరల్ లో మీటింగ్ పెట్టాడు అని ఆయన అన్నారు. రాజకీయ వ్యభిచారి మాటలకి నేను స్పందించాలి.. అస్సలు జనసేన పార్టీని ఎవరిని ఉద్ధరించడానికి పెట్టాడు అని పవన్ కల్యాణ్ ను ద్వారంపుడి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ను నమ్మి వచ్చిన వారు ఎవరు ఉన్నారు.. నన్ను నమ్మిన వారు నాతోనే ఉన్నారు అని ఆయన అన్నారు.
ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని ఆరోపించారు. ప్రజల్ని బాగా చూసుకుంటానంటే వైసీపీతో తనకు ఇబ్బంది లేదన్నారు. ఒక్క సీటు కూడా లేని జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ (శుక్రవారం) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన పేర్ని నాని.. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1న మాత్రమేనని చంద్రబాబుకు పేర్ని గుర్తుచేశారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వదలకుండా అన్నింటిపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్. ఇప్పుడు మరో సారి అధికారం దక్కించుకోవాలని, పార్టీని పరుగులు పెట్టించాలని సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పని చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు ఎంపీ కేశినేని నాని.. నందిగామలో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.. ఎమ్మెల్యే జగన్మోహన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పని చేస్తున్నారని కితాబిచ్చారు.. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరు అయిన అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం అని ప్రకటించారు ఎంపీ కేశినేని నాని.
Rajahmundry Crime: రాజమండ్రిలో వైసీపీ నేత దారుణ హత్యకలకలం రేపింది. రాజమండ్రి 48వ డివిజన్ వైసీపీ ఇంఛార్జ్ బూరాడ భవాని శంకర్ ను పీతా అజయ్ కుమార్ అనే యువకుడు కత్తితో పొట్లు పొడిచి అతిదారుణంగా హత్య చేశాడు. శంకర్ ఇంటిలో భార్యతో కలిసి భోజనం చేస్తుండగా నిందితుడు అజయ్ వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసిన తర్వాత శంకర్ తో మాట్లాడాలి బయటకు రమ్మని పిలిచాడు. అయితే, గుమ్మం బయటకు వచ్చిన శంకర్ పై నిందితుడు…