చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పుంగనూరు ఘటనకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అంటూ ఆయన విమర్శించారు. బైపాస్ లో వెళతాం అని పోలీసులకు రోడ్ మ్యాప్ ఇచ్చారు.. ఆ తరువాత ఉన్నపళంగా పుంగనూరు టౌన్ లోకి వెళ్ళాలని చూసారు.. ఉన్నట్టుండి రూటు మారితే చంద్రబాబుకు ఏమైన జరుగుతుందన్న భయంతో పోలీసులు ఒప్పుకోలేదు.. అయన టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడికి ప్రేరేపించారు అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
Read Also: Pawan Kalyan: రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా..?
కాన్వాయ్ లో వచ్చేప్పుడు టీడీపీ నేతలు తుఫాకులు, రాళ్ళు తెచ్చుకున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరి గవర్నర్ కి ఏమని ఫిర్యాదు చేశారు.. టీడీపీ వారు పోలీసులను కొట్టారని.. రాష్ట్రంలో రాజకీయంగా ఇక పోటీ పడలేమని ఇలాంటి వాటికి చంద్రబాబు తెరలేపారు.. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే.. కాలేజీ సమయం నుంచి చంద్రబాబుకి నన్ను టార్గెట్ చేశారు.. మా ప్రాంతంలో మూడు ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే.. కేసులు వేసి ఆ నిర్మాణాలు ఆయన ఆపివేశారు అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. హంద్రీనీవా పనులు చేసేది ఎన్సీసీ కంపెనీ.. అది కూడా మాపై నింద మోపాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Sangareddy: కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె..
చంద్రబాబు కాన్వాయ్ లోని రౌడీ మూకలు కర్రలు, రాళ్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. విచక్షణా రహితంగా పోలీసులపై దాడులు చేశారు.. చంద్రబాబు తీరు మొగుడ్ని కొట్టి మొగసాలికేక్కినట్టు ఉంది.. పోలీసులపై దాడులు చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.