కొంత మంది రాజకీయ నాయకులు, సొంతంగా ప్రకటించుకున్న ఆర్ధిక నిపుణులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా రాష్ట్ర అప్పుల గురించి వివరించారన్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. దీంతో టీడీపీ, వాళ్ళ మీడియా బాధ మామూలుగా లేదని, ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పుల పై స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడూ అప్పులపై రాష్ట్రానికి కేంద్రం సహకరించ కూడదని వీళ్ళంతా కుట్రలు చేశారన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడితే దాన్ని నమ్మరని, కొత్తగా వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడితే ఫుల్ గా కవరేజ్ ఇస్తారంటూ ఆయన మండిపడ్డారు. ఆర్బీఐ చెప్పినా నమ్మం అంటారని, స్వయం ప్రకటిత మేధావులు చెబితే అదే కరెక్ట్ అంటారన్నారు. దేశంలో నిబంధనలు ఉండవా?? మన రాష్ట్రానికి ప్రత్యేకంగా రూల్స్ ఉంటాయా? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Devineni Avinash : చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన రాలేదు
అంతేకాకుండా.. ‘నిబంధనలకు లోబడే రుణాలు చేస్తున్నాం. ఇలా మాట్లాడుతున్న అందరి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్. వీళ్ళెవరూ రాష్ట్రంలో నివాసం ఉండరు. ప్రతిపక్ష నాయకుడు నేను సింహాన్ని, కొదమ సింహాన్ని అంటున్నారు. అతని పుత్ర రత్నం కూడా మేం సింహాలం అంటున్నాడు. వీళ్ళు తమను తాము జంతువులతో ఎందుకు పోల్చుకుంటున్నారో అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. 2019లో చంద్రబాబు అధికారం దిగే నాటికి ఉన్న రాష్ట్ర అప్పు 2 లక్షల 64 వేల కోట్లు. 2023 లో అప్పు 4 లక్షల 42 వేల కోట్లు. అంటే మా ప్రభుత్వం నాలుగేళ్లల్లో చేసిన అప్పు లక్షా 77 వేల కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 20 వేల కోట్లు అప్పు చేసింది.
Also Read : Free Fire Love Story: పబ్జీ ప్రేమ తరహాలోనే ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ.. ఇంటి నుంచి జంప్
2019 ఏప్రిల్ నెలలోనే 5 వేల కోట్లు అప్పు చేసి పసుపు, కుంకుమకు వాడిన విషయం వాస్తవమా? కాదా?. కార్పొరేషన్ ద్వారా మా ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 10 వేల 200 కోట్లు. గత ప్రభుత్వ హయాంలో అప్పుల సగటు వృద్ధి రేటు 14.4 శాతం. మా నాలుగేళ్ళల్లో అప్పుల సగటు వృద్ధి రేటు 12.4 శాతం. గత ప్రభుత్వం పరిమితికి మించి 16 వేల కోట్లు అప్పు చేసింది. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ లోటు 2.4 శాతం. అప్పుడు జాతీయ సగటు 2.5 శాతం. మా ప్రభుత్వంలో రెవెన్యూ లోటు 2.7 శాతం. ఇప్పుడు జాతీయ సగటు 4.8 శాతం రెవెన్యూ లోటు ఉంది. జాతీయ సగటులో సగం మాత్రమే రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉంది.’ అని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.