చిత్తూరు జిల్లా పుంగనూర్ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. సీఎం జగన్ తన సుదీర్గ పాదయాత్రలో ఎక్కడా కత్తులు, కటార్లతో అల్లర్లకు పాల్పడ లేదు అని ఆయన కామెంట్స్ చేశారు. సీఎం జగన్ కు పట్టం కట్టిన ప్రజల తీర్పును నలభై ఐదు ఏళ్ళు రాజకీయ అనుభవం, సుమారు పదహైదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు గౌరవించటం లేదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. జగన్, పెద్దిరెడ్డిలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై చంద్రబాబు కక్ష గట్టాడు అని పేర్కొన్నారు. అందుకే బ్రాంది బాటిళ్ళు, కత్తులు, రకరకాల తుఫాకీలతో చంద్రబాబు తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అని డిప్యూటీ సీం నారాయణ స్వామి అన్నారు.
Read Also: SoyaBean Pest Control : సోయాబీన్ పంటను ఆశించే తెగుళ్లను నివారించే పద్ధతులు..
ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రారా నా కొడక్కల్లారా అని పిలుస్తున్నాడు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఎస్ఐ, సీఐలను బట్టలిప్పి కొడతా అంటూ నోరు పారేసుకోవడం తగదు అని ఆయన పేర్కొన్నారు. ఈ అల్లర్లను ప్రోత్సహించింది సాక్షాత్తూ చంద్రబాబే.. సీఎం జగన్, డీజీపీల సహనాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.. అల్లర్ల నిందితుల్లో ఏ1గా చంద్రబాబును చేర్చాలి అని డిప్యూటీ సీఎం చెప్పారు. పుంగనూర్ లో నిన్న( శుక్రవారం ) టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేయడంతో ఈ వివాదం చెలరేగింది. టీడీపీ అధినేత తీరుపై అధికార వైసీపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Bandi Sanjay : మొన్న వర్షాలకు నష్టపోయిన రైతులకే ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు