కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సుబ్బన్న అక్రమ అరెస్టుపై మచిలీపట్నం పోలీసులను నిలదీశారు. మచిలీపట్నంలో ఛలో మెడికల్ కాలేజ్ నిరసన చేపట్టినందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్‌కు పిలిపించి అరెస్ట్ చేశారని, ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా…
ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి పొలిటికల్ వీఆర్ఎస్ తీసుకోబోతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ఎందుకు ప్రకటించారు? అది రాజకీయ వైరాగ్యమా? లేక అంతకు మించిన వ్యూహమా? వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉండి, జగన్‌కు అత్యంత సన్నిహిడని పేరున్న ఆ లీడర్‌కి ఎవరు? పెద్ద స్థాయి పలుకుబడి ఉండి కూడా ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? ఉమ్మడి శ్రీకాకుళంలో సుదీర్ఘ రాజకీయ ఆధిపత్యం చెలాయించారు ధర్మాన బ్రదర్స్. జిల్లాలో యాంటీ టీడీపీ స్టాండ్ అంటే……
ఆ పొలిటికల్ కపుల్ తమ పాత బేస్‌ని ప్లాన్ ప్రకారం వదిలేస్తున్నారా? తమ రాజకీయ ఉనికి కోసం కొత్త అదే పార్టీలో కొత్త ప్లాట్‌ఫామ్‌ని వెదుక్కుంటున్నారా? మేడమ్ ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో వైసీపీ తరపున మరో నేత యాక్టివ్ అవడమే దీనికి సంకేతమా? ఏదా నియోజకవర్గం? ఒకచోట తగ్గిస్తూ… మరోచోట హైప్ ఇస్తున్న ఆ దంపతులు ఎవరు? వైసీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా పాలిటిక్స్‌లోకి వచ్చారు సాంబశివారెడ్డి. అయితే… సొంత నియోజకవర్గం శింగనమల ఎస్సీ…
విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి చెప్పారు. జగన్ పర్యటన రోజే విశాఖలో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే జాతీయ రహదారి బ్లాక్ అవుతుందని, రోడ్ బ్లాక్ అయితే తమిళనాడులో దళపతి విజయ్ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ…
శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బొత్స కుటుంబం విజయనగరంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. బొత్స కుటుంబంకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయగా.. సిరిమానోత్సవం ప్రారంభమైన కాసేపటికే వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో బొత్స కుటుంబ సభ్యులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిమానోత్సవ తిలకానికి ప్రత్యేకంగా అర్భన్ బ్యాంక్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనపై ఉత్కంఠకు తెరలేపింది. రోడ్డు మార్గం ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా జగన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ప్రకటించారు. జగన్ టూర్ కోసం భారీ జన సమీకరణ జరుగుతున్నందున 63 కిమీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు అవసరమైన భద్రత…
వైసీపీ కొత్తగా తెచ్చిన ‘డిజిటల్ బుక్’ యాప్‌లో ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజినిపై తాజాగా ఫిర్యాదు అందింది. విడదల రజినిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇంటిపై రజిని దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి రజినిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సొంత…