ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా ఉందా? మరీ… నోట్లో నాలుక లేని వ్యక్తిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టి పార్టీ అధిష్టానం చేతులు కాల్చుకుంటోందా? మేటర్ ఏదైనా సరే… పలాయనమే ఆ ఇన్ఛార్జ్కు తెలిసిన ఏకైక పరిష్కారమా? ఎవరా నాయకుడు? ఏంటా ఫెయిల్యూర్ స్టోరీ? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన దద్దాల నారాయణ…
ఆ మాజీ మంత్రి రివర్స్ అటాక్ మొదలు పెట్టారా? ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే డిఫెన్స్‌లోకి నెట్టాలనుకుంటున్నారా? అందుకే వాయిస్ రెయిజ్ చేస్తున్నారా? ఆ విషయంలో గవర్నమెంట్ పెద్దలు ఏమనుకుంటున్నారు? ఇంకీ ఎవరా మాజీ మంత్రి? ఏ విషయంలో రివర్స్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే….అది నకిలీ మద్యమే. దాన్ని బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ, అసలు అందులో ఉన్నది కూడా మీ వాళ్ళేనంటూ… విపక్షం నోరు మూయించాలని…
వైసీపీలో నిశ్శబ్దం పూర్తి స్థాయిలో బద్దలైపోయినట్టేనా? ఇన్నాళ్ళు అనుమానాలతో చూద్దాం, చేద్దాం అనుకున్న సీనియర్స్ కూడా ఇక యాక్టివ్ బటన్ ఆన్ చేసినట్టేనా? ఇప్పుడే ఎందుకు గేర్ మారుస్తున్నారు అంతా? ఇప్పటికీ గడప దాటకుంటే మీ కుర్చీల కిందికి నీళ్ళొస్తాయన్న వార్నింగ్స్ బలంగా పని చేశాయా? ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తోంది. వైసీపీ కనీవినీ ఎరుగని ఘోర ఫలితాలను చూడటం, అధికార మార్పిడి జరిగాక మాజీ…
Rachamallu Sivaprasad Reddy: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కొయ్యురు మండలంకు చెందిన వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే నూకరాజు హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. ఈరోజు భూమి విషయంలో గిరిజనులకు, ఆయనకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. చివరకు హత్యకు దారితీసింది. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నూకరాజు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద జడ్పిటిసి జెడ్పీటీసీ వారా…
Dharmana Prasada Rao: ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకుంటాం అంటే ఎలా?.. 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం.. కాలేజీతో పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంది.. గవర్నమెంట్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికే చూస్తారని తెలిపారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మచిలీపట్నం ఆర్ఆర్ పేట పీఎస్‌లో సీఐ ఏసుబాసుపై బెదిరింపులకు దిగారని ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్ని నానితో పాటు 29 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును పేర్ని నాని కలిసి వివరణ ఇచ్చారు. సీఐ తనను రెచ్చగొట్టాడని, తాను కూల్‌గానే మాట్లాడానని తెలిపారు.…
మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. ఆర్ పేట సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నాం. సుబ్బన్నను…
వైద్య ఆరోగ్య రంగంలో కూటమి ప్రభుత్వం పెయిల్ అయ్యిందని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ‘ఆరోగ్యశ్రీ’ అనారోగ్యశ్రీగా మారిపోయిందని విమర్శించారు. 3 వేల కోట్లు బకాయిలు రాక నెట్ వర్క్ ఆస్పత్రులు బోర్డులు తిపేస్తున్నాయన్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులు బకాయిలు విడుదల చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. బకాయిలు నిలిచిపోవడంతో సేవలు నిలిపివేశారని, దేశంలో ఎక్కడ ఆరోగ్య సేవలు నిలిచిపోలేదని విడదల రజిని ఫైర్…
ఏపీలో కల్తీ మద్యం ఘటనలే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుంభకోణంలో ఉన్న పెద్దలు అందరూ బయటకు రావాలని, టీడీపీకి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు వెనకడుతుంది? అని ప్రశ్నించారు. కల్తీ మద్యానికి సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని విమర్శించారు. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా టీడీపీ నేతలు మార్చుకున్నారని, నారావారి…