Pakistan: భయం గుప్పిట్లో పాకిస్థాన్.. కారణం ఇదే!
- పాక్‌కు తగులుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు..
- హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ పరిణామం పాకిస్థాన్‌ను ఊపిరి ఆడనివ్వని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ప్రపంచ ఇంధన అవసరాలలో 20 శాతం వాటా హోర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. నిజానికి ప్రస్తుతం దాయాది దేశం భయం గుప్పిట్లో ఉంది. ఎందుకంటే దేశంలో ఎప్పుడు చమురు సంక్షోభం ముదురుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొనడంతో, అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
READ ALSO: OnePlus 15T: 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ 50MP కెమెరాతో.. వన్ ప్లస్ 15టీ వచ్చేస్తోంది..
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
పాకిస్థాన్‌లో ఇంధన ఎమర్జెన్సీ..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే 15 శాతం పెరిగాయి. త్వరలోనే చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు దిగుమతులు నిలిచిపోవడంతో పాకిస్థాన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం రంగంలోకి దిగి, దేశంలో కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చమురు కంపెనీల లిక్విడిటీని కాపాడేందుకు ప్రతి వారం పెట్రోలియం ధరలను సవరించాలని నిర్ణయించింది. గల్ఫ్ దేశాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో, పాకిస్థాన్ ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు పెంచుకోవడంపై దృష్టి సారించింది.
పాక్ వద్ద ఉన్న నిల్వలు ఎంతంటే..
తాజా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ వద్ద ఉన్న చమురు నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.
ముడి చమురు (Crude Oil): కేవలం 10 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి.
పెట్రోలియం ఉత్పత్తులు: సుమారు 28 రోజులకు సరిపడా ఉన్నాయి.
LPG (వంట గ్యాస్): కేవలం 15 రోజులు మాత్రమే వస్తుంది.
దిగుమతులపై దెబ్బ..
పాకిస్థాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, నైజీరియా వంటి దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. అయితే, హోర్ముజ్ మార్గం మూతపడటంతో ఈ సరఫరా గొలుసు పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ కొత్త మార్గాల కోసం అన్వేషిస్తోంది.
READ ALSO: Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!