Oil-Gas Shortage: యుద్ధం వేళ కేంద్రం గుడ్‌న్యూస్!.. చమురు, గ్యాస్‌పై కీలక సమాచారం
- యుద్ధం వేళ కేంద్రం గుడ్‌న్యూస్!
- చమురు, గ్యాస్‌పై కీలక ప్రకటన
- భయాందోళనలు తొలగినట్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐదు రోజులుగా భీకర యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అమెరికాకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇలా దాడులు-ప్రతికార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. దీంతో హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ప్రస్తుతం ఎక్కడికక్కడే చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ సంక్షోభం రావొచ్చని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారతదేశంలో కూడా నిల్వలు కూడా తగ్గుపోతున్నాయని జోరుగా ప్రచారం జరిగింది.
ఇలాంటి వదంతుల నేపథ్యంలో కేంద్ర వర్గాల నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇంధన భద్రత విషయంలో భారతదేశం చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నట్లుగా కేంద్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిల్వలు ఉన్నాయని.. ప్రతి రోజూ స్టాక్ భర్తీ జరుగుతోందని తెలిపాయి. ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ కొరత లేదని.. అలాగే ప్రపంచంలో కూడా ముడి చమురు కొరత కూడా లేదని.. భారతదేశం ఇతర సరఫరాదారులతో కూడా సంప్రదింపులు జరుపుతోందని వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఆస్ట్రేలియా, కెనడా కూడా భారతదేశానికి గ్యాస్ విక్రయించడానికి ముందుకొచ్చాయని.. ఇతర ప్రత్యామ్నాయ వనరుల కోసం కూడా వెతుకుతున్నట్లు తెలిపింది. ఇటీవలే యూఏఈ, యూఎస్‌తో కూడా కొత్త ఒప్పందాలు జరిగినట్లుగా గుర్తుచేసింది. ప్రస్తుతం ముడి చమురు, ఎల్పీజీ కొనుగోలు చేయడానికి ప్రధాన చమురు ఉత్పత్తిదారులు, వ్యాపారులతో చర్చలు జరుపుతోందని తెలిపాయి. భారతదేశం అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA), పెట్రోలియం ఎగుమతి చేసే సంస్థల (OPEC)తో కూడా భారతదేశం చర్చలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశాయి. నౌకలకు బీమా పొందడానికి భారతదేశం యూఎస్‌తో చర్చలు జరుపుతోందని.. భారతదేశం రోజుకు రెండుసార్లు ఇంధన పరిస్థితిని సమీక్షిస్తోందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.
Government source say –
* India is in a very comfortable position in energy security. Current position of stock is comfortable. Stock is being replenished every day.
* No shortage of LPG or LNG. There is no shortage of Crude oil in the world. India is in touch with other… pic.twitter.com/09r88Hdv2Y
— ANI (@ANI) March 5, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!