శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బొత్స కుటుంబం విజయనగరంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. బొత్స కుటుంబంకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయగా.. సిరిమానోత్సవం ప్రారంభమైన కాసేపటికే వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో బొత్స కుటుంబ సభ్యులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిమానోత్సవ తిలకానికి ప్రత్యేకంగా అర్భన్ బ్యాంక్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనపై ఉత్కంఠకు తెరలేపింది. రోడ్డు మార్గం ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. తమిళనాడు కరూర్లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా జగన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ప్రకటించారు. జగన్ టూర్ కోసం భారీ జన సమీకరణ జరుగుతున్నందున 63 కిమీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు అవసరమైన భద్రత…
వైసీపీ కొత్తగా తెచ్చిన ‘డిజిటల్ బుక్’ యాప్లో ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజినిపై తాజాగా ఫిర్యాదు అందింది. విడదల రజినిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇంటిపై రజిని దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి రజినిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సొంత…
వ్యవసాయం అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చటానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని, చంద్రబాబు పుణ్యమా అని రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారన్నారు. యూరియా కోసం రైతులు పడే అగచాట్లు ఈ ప్రభుత్వ పెద్దలకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ తెచ్చామని చెప్తున్న యూరియా ఏమైంది?, రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లోకి ఎలా…
108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుయ్ కుయ్ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి’ అని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు ప్రభుత్వం ఉరివేస్తోందని ఫైర్ అయ్యారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో.. ఆమె ఆటోలోనే ప్రసవించింది. వైద్యం అందక శిశువు ఆటోలోనే కన్నుమూసింది.…
ఆ వైసీపీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిస్తే…. ఆయన నియోజకవర్గాన్ని వదిలి విజయవాడలో ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి హాజరవకూడదనన్న వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆయనకు మింగుడు పడటం లేదా? శాసనసభ్యుడి కదలికల మీద స్వపక్షం, అధికారపక్షం ఓ కన్నేసి ఉంచాయా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్పెషల్ స్టోరీ? రేగం మత్స్యలింగం….అరకు ఎమ్మెల్యే. 2024లో కూటమి దూకుడుని తట్టుకుని వైసీపీ గెలిచిన 11మందిలో ఒకరు. టీచర్ టర్న్డ్ పొలిటీషియన్ ఈయన. గత ఎన్నికలకు…