చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను ఆ మంత్రి పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నారా? తన పొలిటికల్ జర్నీ టాప్ గేర్‌కు తగ్గకుండా ఉండటం కోసం మధ్యలో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారా? నియోజకవర్గంలో ఇక శత్రు శేషం లేకుండా చూసుకోవాలనుకుంటున్నారా? గతంలో జరిగిన అవమానానికి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నారని అంటున్న ఆ మంత్రి ఎవరు? ఏంటా గతం?
Also Read:KGB కథ తెలుసా.. ఈ ఏజెంట్ ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు..
పాలకొల్లు నియోజకవర్గంలోని సాధారణ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో…. పొలిటికల్ కల్చర్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా, కాస్త తేడాగా కనిపిస్తూ ఉంటుంది. 2014 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. ఎనీ సీజన్, ఎనీ టైం… పరిస్థితుల్ని అనుకూలంగా మల్చుకుని తన ముద్ర వేయడంలో ఆయన దిట్ట అని చెప్పుకుంటారు స్థానికంగా. ప్రస్తుతానికి హ్యాట్రిక్ కొట్టినా… ఇక మీదట కూడా తన హవా తగ్గకుండా ఇదే ఒరవడి కొనసాగించడం కోసం మంత్రి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారన్న విషయం ప్రస్తుతం పాలకొల్లులో పొలిటికల్ హాట్‌గా మారింది.
సాధారణంగా జనంలో ఎక్కువ ఉంటూ… తన బలం పెంచుకోవడంపై ఫోకస్ చేసే మంత్రి నిమ్మల రామానాయుడు… ప్రస్తుతం దాన్ని రాజకీయ ప్రత్యర్థుల మీదికి షిఫ్ట్ చేస్తున్నారన్న వార్తలు కలకలకం రేపుతున్నాయి. ఆ విషయంలో చర్చలు, విశ్లేషణల సంగతి ఎలా ఉన్నా… లోకల్ వైసీపీ నేతలకు మాత్రం నిద్ర పట్టడం లేదట. ప్రస్తుతం ఒకరు కాదు, ఇద్దరు కాదు… నియోజకవర్గంలో కాస్తో కూస్తో బలం ఉన్న ప్రతి వైసీపీ నాయకుడికి ఇటీవల సీఐడీ నోటీస్‌లు వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలు వెదకాలంటే.. రీల్ బాగా రీవైండ్ చేయాలన్నది లోకల్‌గా వినిపిస్తున్న మాట. 2022 ఆగస్టులో టిడ్కో ఇళ్ళ దగ్గర జరిగిన గొడవే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అప్పటి అధికార పార్టీ వైసీపీ తరఫున ఉన్న నేతలంతా మూకుమ్మడిగా టిడిపి ఎమ్మెల్యే రామానాయుడుని టార్గెట్ చేశారట.. వైసీపీ ఓవైపు నిమ్మల రామానాయుడు, ఆయన అనుచర వర్గం మరోవైపు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అధికార పార్టీ తమను వేధిస్తోందంటూ నిమ్మలతో పాటు ఆయన అనుచరుల్లో కొంతమంది పోలీసులను ఆశ్రయించారు.. వైసీపీ నాయకులు తమ మీద మారణాయుధాలతో దాడి చేశారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. అప్పట్లో ఈ వ్యవహారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలా చెలరేగిన గొడవ ఇప్పుడు పాలకొల్లు వైసీపీ నాయకులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందంటున్నారు. నాడు టిడ్కో ఇళ్ళ దగ్గర రామానాయుడు మీద హత్యాయత్నం జరిగిందన్న ఫిర్యాదు మీద కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఐడీ దృష్టి సారించింది.
ఈ క్రమంలోనే…విచారణకు హాజరవమంటూ… 24 మంది స్థానిక వైసీపీ నాయకులకు సీఐడీ నోటీస్‌లు అందాయి. దాంతో… రోజుకొకరి చొప్పున పాలకొల్లు నుంచి రాజమండ్రిలో విచారణకు వెళ్ళి వస్తున్నారట. విచారణ తర్వాత తమ పరిస్థితి ఏంటన్న కంగారు వాళ్ళలో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రామానాయుడు ఎమ్మెల్యేగా ఉండి మనం పవర్‌లో ఉన్నప్పుడే అడ్డుకోవడం కష్టమైంది….. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నందున యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందోనన్నది వాళ్ళ భయంగా తెలుస్తోంది. మరికొందరు వైసీపీ నేతలైతే… కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీస్‌లు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కానీ… వీళ్ళందరికీ పార్టీ తరపున సరైన సపోర్ట్ దక్కక డీలా పడుతున్నారట.
ఇప్పటికే పాలకొల్లు వైసీపీ గ్రూపు తగాదాలతో సతమతమవుతుండగా…. ఇప్పుడు కీలక నేతలకు సైతం సిఐడి నోటీసులు అందడం మరింత కలకలం రేపుతోంది. ఓ వైపు సిఐడి కేసులు, మరోవైపు పార్టీ పెద్దల మద్దతు దొరక్కపోవడం పాలకొల్లు వైసీపీ నేతల్ని అయోమయంలోకి నెడుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పాలకొల్లులో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న వైసీపీకి ఈ పరిణామాలు కోలుకోలేని దెబ్బ అన్న వాదన బలపడుతోంది.
Also Read:Hyderabad: సోమాజిగూడ లోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం..
నిమ్మల రామానాయుడుని ఓడించేందుకు ఇప్పటికి ఆరు సార్లు అభ్యర్థులని మార్చిన అధిష్టానం ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్ ను ఏ రకంగా కవర్ చేస్తుందోనన్న కంగారు పాలకొల్లు వైసీపీ కేడర్‌లో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ కీలక నేతలందరికీ ఒకేసారి కేసుల భయం పట్టుకోవడంతో ఇక్కడ పార్టీ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే శత్రుశేషం లేకుండా చూసుకోవడంలో మంత్రి నిమ్మల చెయ్యి తిరిగి పోయారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా…. రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదనడానికి పాలకొల్లు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్.