తాడేపల్లి : టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో రైతలను చాలా ఇబ్బందులకు గురి చేశారని… రైతులు కొట్టిన చావు దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయిందని చురకలు అంటించారు. చంద్రబాబు ఎప్పుడైనా 21 రోజుల్లో ఒక రైతుకు అయినా ఐదు రూపాయలు చెల్లించారా?? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని…చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఏడాదికి సగటున 55 లక్ష మెట్రిక్…
నామినేటెడ్ పోస్టుల పందేరం ముగియడంతో ఎమ్మెల్యేల ఫోకస్.. కేబినెట్ బెర్త్‌లపై పడింది. రెండున్నరేళ్ల ప్రక్షాళన గడువు దగ్గర పడేకొద్దీ.. తాడేపల్లి వైపు ఆశగా చూస్తున్నారు. కేబినెట్లో ఉన్నవారు టెన్షన్ పడుతుంటే.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఈ అంశమే హాట్ టాపిక్. తాడేపల్లి వైపు ఆశగా చూస్తోన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో 13 చోట్ల గెలిచింది వైసీపీ. ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. ఇద్దరికి జిల్లా…
జమ్మలమడుగు వైసీపీలో నేతల మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చిందా? పార్టీ పెద్దల సంతృప్తి కోసమే చేతులు కలిపారా? నాయకుల మధ్య వైరం అలాగే ఉందా? కొత్త రగడ పార్టీలో కాక రేపుతోందా? ఆ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కష్టమేనా? లెట్స్ వాచ్! ఇద్దరి మధ్య సఖ్యత కష్టమేనా? కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రమైన జమ్మలమడుగులో 2019 ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వైసీపీలో చేరిన తర్వాత నియోజకవర్గంపై…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో… చంద్రబాబు బాగా నిరాశ పడ్డాడని ఎద్దేవా చేశారు. ”కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు పగలు తిట్టుకుని రాత్రి ఫోన్లో పరామర్శించుకుంటారని చంద్రం ఫ్రంట్ పేజీలో ఘోషిస్తున్నాడు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసేది ఎవరు? ఢిల్లీలో అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నదెవరు? నీ సొంత అనుభవాలను ఇతరులకు ఆపాదిస్తే ఎలా? కృష్ణా ప్రాజెక్టులపై…
ఇద్దరూ మంత్రి అనుచరులే. హోదాకు తగ్గ పదవుల్లోనే ఉన్నారు. కానీ.. ఆధిపత్యపోరు వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం వచ్చేసింది. ఎవరికి నచ్చజెప్పాలో.. ఇంకెవరిని బుజ్జగించాలో తెలియక తలపట్టుకుంటున్నారట ఆ అమాత్యుడు. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. పదవులు చేపట్టిన నాలుగు నెలలకే గొడవలు ఈమె ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ గంగాడ సుజాత. ఈయన డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ. ఇద్దరూ అధికారపార్టీలోనే ఉన్నారు. పైగా మంత్రి బాలినేని…
తమ్మినేని పై మళ్లీ కౌంటర్ అటాక్ కు దిగారు కూనరవికుమార్. జగనన్న భూమ్, జామ్ మందులు తాగడం మానుకోవాలని… పిచ్చి మందు తాగి తమ్మినేని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పిచ్చి బ్రాండ్లు తాగడం తగ్గిస్తే మంచి మాటలొస్తాయని… మొక్కలు ఆక్సిజన్ పీల్చుకుంటాయనడం ఈ మందు ప్రభావమేనని తెలిపారు. ‘నన్ను పాతాళంలోకి తొక్కేయడం నీ అబ్బతరం కూడా కాదు…నా కాలు బొటనవేలు మీదున్న వెంట్రుక కూడా పీకలేవు ‘ అంటూ కూన రవి కూమార్ మండిపడ్డారు. read…
సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీలో నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు.. గతంలో ఉన్న జోడు పదవులు విధానానికి గుడ్‌బై చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్… నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు పెద్దపీట వేశారు.. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటించారు.. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68 పోస్టులు, పురుషులకు 67 పదవులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కట్టబెట్టారు.. పదవులు అలంకార ప్రాయం కాదని.. సామాజిక న్యాయానికి…
శ్రీకాకుళం : టీడీపీ నేత కూన రవికుమార్ కు మరో సారి స్పీకర్ తమ్మినేని కౌంటర్ ఇచ్చారు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసని.. తాను కచ్చితంగా ఆ పంథాలో వెళతానని తెలిపారు. గట్టిగా నోరుపెడితే బెదిరిపోయేవాడిని కాదని.. వంద కాదు వెయ్యి అడుగులైనా ముందు కెళతానని స్పష్టం చేశారు. read also : ఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ : ఏపీపీఎస్సీ వామనావతారుడి మాదిరి భూమిలోకి తొక్కేస్తానని… అందులో ఎలాంటి అనుమానం…
అన్న ఎమ్మెల్యే.. పెత్తనం తమ్ముడిది. అక్కడ ఎవరికైనా సరే.. తమ్ముడి మాటే వేదం. దీంతో తమ్ముడి కుమ్ముడి గురించి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం. ఇదే ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. నందిగామలో ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై చర్చ! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ ఖాతాలో పడిన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా నందిగామ ఒకటి. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిన మొండితోక జగన్మోహనే 2019లో గెలిచి అసెంబ్లీలో…