పేకాట పేకాటే.. అనుచరులు అనుచరులే. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ, పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఓ ఘటన ఏకంగా ఖాకీలకు చుక్కలు చూపించిందట. నేతల ఒత్తిళ్లు తట్టుకోలేని పోలీసులు పేకాట ఆడుతూ దొరికిన వాళ్లను వేరే జిల్లాలో వదిలేయాల్సి వచ్చింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రూటు మార్చిన పేకాట మాఫియా! గుంటూరు జిల్లా పేకాటకు హబ్‌గా మారింది. జిల్లాలో కొంతమంది అధికారపార్టీకి చెందిన నేతలు పేకాట ఆడిస్తున్నారని ఓపెన్‌గానే చెబుతున్నారు.…
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఇన్నాళ్లూ ఆశించారు. చివరకు ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాష్ట్రస్థాయి పదవి కాదు కదా.. కనీసం జిల్లా స్థాయి పోస్టుల్లోనూ వారికి చోటు దక్కలేదు. ఏదో ఆశిస్తే.. ఇంకేదో అయిందని వాపోతున్నారట సీనియర్లు. మెడలో కండువా ఉన్నా.. చేతిలో పదవి లేక తెగ మథన పడుతున్నారట. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నారా .. లేరా? వైసీపీ ఆవిర్భావం…
ఎన్నికల్లో గెలిస్తే ఆ లెక్క వేరు. గెలిపించే సత్తా ఉంటే ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది. ఆ నాయకుడు ఈ రెండు కేటగిరీల్లోకి రాలేదో ఏమో.. ఆటలో బొప్పాయిలా మారిపోయానని ఆవేదన చెందుతున్నారట. పదవులు లభించినవారు వచ్చి కలుస్తుంటే… అభినందించి పంపుతున్నారు. ఇదే సమయంలో తనకు ఎలాంటి పదవి దక్కలేదని ఎవరికీ చెప్పుకోలేక… నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం. బొప్పనకు దక్కని నామినేటెడ్ పోస్ట్! బొప్పన భవకుమార్. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున…
పదవులిచ్చారు. కొత్త తంటా తెచ్చారని ఈ ఎమ్మెల్యేలు విసుక్కుంటున్నారట. మాకెందుకు అవకాశం ఇవ్వలేదని సన్నిహితులు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలీటం లేదట. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల చైర్మన్ పదవులు స్థానిక ఎమ్మెల్యేలకు సమస్యగా మారింది. సొంత వారిని కాదని ఇతర ప్రాంతాల వారికి ఎలా ఇస్తారని నిలదీస్తున్నారట. చిత్తూరు జిల్లాలో పదవుల పంపకాలు బాగానే జరిగినా, ఆ రెండు ఆలయాల చైర్మన్ గిరి మాత్రం వివాదంగా మారింది. ఎమ్మెల్యేకి నామినేటెడ్ పదవుల వ్యవహారం పెద్దగా…
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర వైఖరి కి నిరసనగా పార్లమెంట్ లో వైసిపి ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు కు జీవం పోసింది వైఎస్ఆర్ అని.. అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి దేనని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని…పోలవరం కు 55 వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. read also : తెలంగాణ…
తాడేపల్లి : టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో రైతలను చాలా ఇబ్బందులకు గురి చేశారని… రైతులు కొట్టిన చావు దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయిందని చురకలు అంటించారు. చంద్రబాబు ఎప్పుడైనా 21 రోజుల్లో ఒక రైతుకు అయినా ఐదు రూపాయలు చెల్లించారా?? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని…చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఏడాదికి సగటున 55 లక్ష మెట్రిక్…
నామినేటెడ్ పోస్టుల పందేరం ముగియడంతో ఎమ్మెల్యేల ఫోకస్.. కేబినెట్ బెర్త్‌లపై పడింది. రెండున్నరేళ్ల ప్రక్షాళన గడువు దగ్గర పడేకొద్దీ.. తాడేపల్లి వైపు ఆశగా చూస్తున్నారు. కేబినెట్లో ఉన్నవారు టెన్షన్ పడుతుంటే.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఈ అంశమే హాట్ టాపిక్. తాడేపల్లి వైపు ఆశగా చూస్తోన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో 13 చోట్ల గెలిచింది వైసీపీ. ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. ఇద్దరికి జిల్లా…
జమ్మలమడుగు వైసీపీలో నేతల మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చిందా? పార్టీ పెద్దల సంతృప్తి కోసమే చేతులు కలిపారా? నాయకుల మధ్య వైరం అలాగే ఉందా? కొత్త రగడ పార్టీలో కాక రేపుతోందా? ఆ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కష్టమేనా? లెట్స్ వాచ్! ఇద్దరి మధ్య సఖ్యత కష్టమేనా? కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రమైన జమ్మలమడుగులో 2019 ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వైసీపీలో చేరిన తర్వాత నియోజకవర్గంపై…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో… చంద్రబాబు బాగా నిరాశ పడ్డాడని ఎద్దేవా చేశారు. ”కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు పగలు తిట్టుకుని రాత్రి ఫోన్లో పరామర్శించుకుంటారని చంద్రం ఫ్రంట్ పేజీలో ఘోషిస్తున్నాడు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసేది ఎవరు? ఢిల్లీలో అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నదెవరు? నీ సొంత అనుభవాలను ఇతరులకు ఆపాదిస్తే ఎలా? కృష్ణా ప్రాజెక్టులపై…