ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన పదవుల వ్యవహారం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదవులిచ్చారు. కొత్త తంటా తెచ్చారని ఈ ఎమ్మెల్యేలు విసుక్కుంటున్నారట. మాకెందుకు అవకాశం ఇవ్వలేదని సన్నిహితులు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలీటం లేదట. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల చైర్మన్ పదవులు స్థానిక ఎమ్మెల్యేలకు సమస్యగా మారింది. సొంత వారిని కాదని ఇతర ప్రాంతాల వారికి ఎలా ఇస్తారని నిలదీస్తున్నారట.
చిత్తూరు జిల్లాలో పదవుల పంపకాలు బాగానే జరిగినా, ఆ రెండు ఆలయాల చైర్మన్ గిరి మాత్రం వివాదంగా మారింది. ఎమ్మెల్యేకి నామినేటెడ్ పదవుల వ్యవహారం పెద్దగా తలనొప్పిగా మారిందట పదవిని సోంత నియోజకవర్గం వారికి కాకుండా పక్కవారిని ఎలా ఇస్తారంటూ… అ ఇద్దరు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారట అనుచరులు…. ఇప్పుడిదే ఇదే అ జిల్లా హాట్ టాపిక్ గా మారింది..
Also Read
నామినేటెడ్ పోస్టుల వ్యవహారం చిత్తూరు జిల్లాలో కాక రేపుతోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం.. జిల్లాలో తిరుమల తర్వాత రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలు. ఈ ఆలయాల పాలక మండళ్ల చైర్మన్ పదవులను తొలిసారిగా స్థానికేతరులకు ఇచ్చారు. ఈ నిర్ణయం శ్రీకాళహస్తీశ్వరాలయ చైర్మన్ పదవిపై ఆశ పెట్టుకున్న స్థానిక వైసీపీ నేతలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. మరోవైపు కాణిపాకం ఆలయానికి స్థానికేతరులకు ఇవ్వడంపై కూడా ఇదే స్పందన కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు రోడ్డెక్కి ఉద్యమాలు చేశాం. పోలీసు కేసులు ఎదుర్కొన్నాం. పార్టీ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలయ్యాం. అధికారంలోకి వచ్చాక న్యాయం జరుగుతుందనుకున్నాం. రెండేళ్లు దాటి పోయినా ఏ పదవీ లేదు. చివరికి ఆలయ చైర్మన్ పదవుల్లోనూ అన్యాయం జరిగిందంటున్నారట
ఈ విషయంలో శ్రీకాళహస్తీ వైసీపీ నేతలు… ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్ చూట్టు తిరుగుతూంటే …కాణిపాకం ఆలయ చైర్మన్ విషయంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారిందని సమాచారం. శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా స్థానికేతరుడు, సత్యవేడు మండలానికి చెందిన బీరేంద్రవర్మను నియమించారు. అయితే ఈ పదవిని స్థానిక నేతలు చాలామంది ఆశించారు. ఇప్పుడు వారంతా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక కాణిపాకం ఆలయ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ జ్ఞానేంద్రర్ రెడ్డి వదిన చిత్తూరుకు చెందిన ప్రమీలమ్మ రెడ్డిని నియమించారు. దీనిపై కూడా ఉభయదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ విషయం ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదంటూ, ధర్నాకు కూడా దిగారు. చైర్మన్ పదవి స్థానికేతరులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించి స్టే తెస్తామన్నారు. ఉభయదారులే కాకుండా పూతలపట్టు వైసీపా నేతలు సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు
దీంతో ఈ పదవుల వ్యవహారం తమకు తెలియకుండానే జరిగిందంటూ సర్దిచెప్తున్నారట ఎమ్మెల్యేలు అటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్ తన అనుచరులకు పదవి ఇప్పించాలని కోరినప్పటికీ, జిల్లా మంత్రి ఒత్తిళ్ల కారణంగా స్థానికేతరుడికి వచ్చిందని టాక్ నడుస్తోంది. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కాదని స్థానికేతరులకు చైర్మన్ పదవి ఇస్తే, తనను నమ్ముకున్న వారికి ఏం సమాధానం చెప్పాలా అని ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారట. అటు ఎమ్మెల్యేలు సర్ది చెప్తున్నా, స్థానిక నేతలు మాత్రం నమ్మటం లేదట. దీంతో ఆలయ చైర్మన్ పదవుల వ్యవహారం ఎలాంటి పరిస్థతులకు దారి తీస్తుందో అనే ఆందోళన చిత్తూరు వైసీపీ వర్గాల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!