పొలిటికల్ ఎంట్రీలోనే ఆయన ఎంపీ అయ్యారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి. గెలిచి రెండేళ్లయింది. అంతలోనే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ గ్యాప్ వచ్చినట్టు టాక్. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏమా కథ? 2019లో ఎంపీగా గెలిచి రాజకీయ తెరపైకి వచ్చారు డాక్టర్ సంజీవ్ కుమార్. కర్నూలు జిల్లాలో ప్రముఖ వైద్యులు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్సభకు పోటీచేసి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఎంట్రీలోనే బంపర్ ఛాన్స్ కొట్టారని…
తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు అనవసరంగా సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసింది మాజీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు జి ఓ 69 తెచ్చి రాయలసీమకు అన్యాయం చేశారు. 800 అడుగులు వద్ద విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు అని తెలిపారు. 254 టీఎంసీలు అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ…
ఆ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు దాటింది. ఏడాదికాలం కరోనా ఖాతాలో కలిసిపోయింది. మిగిలిన టైమ్లో ఆయన యాక్టివ్గా ఉన్నది తక్కువే. ఉలుకు లేదు.. పలుకు లేదు. సీన్ కట్ చేస్తే గేర్ మార్చి.. స్పీడ్ పెంచారు. ఓ రేంజ్లో హడావిడి చేస్తున్నారు. గెలిచినప్పటి నుంచి కామ్ ఉన్న ఆయన ఎందుకు వైఖరి మార్చుకున్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అప్పట్లో మంత్రి పదవి రాలేదని అలిగినట్టుగా ప్రచారం ధర్మాన ప్రసాదరావు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన…
అధికార పార్టీ నుండి బయటకు వచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష పార్టీ కూడా షాక్ ఇచ్చింది. ఇంటి కూటికి.. బంతి కూటికి కాకుండా పోయారు. అంతా మోసం చేశారని వాపోతున్నారట. రాజకీయ భవిష్యత్పై బెంగ పెట్టుకున్నారట. ఎవరా నాయకుడు? ఏమా కథ? పొలిటికల్ స్టెప్పులు సరిగ్గా వేయలేకపోయారా? ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రకాశం జిల్లాలో మళ్లీ చర్చ మొదలైంది. ఇటు అధికార వైసీపీలో అటు ప్రతిపక్ష టీడీపీలో డేవిడ్రాజుకి…
ఆ జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్ బెర్త్ ఊరిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అప్పుడే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలంటే కీలకంగా మారే సమీకరణాలేంటి? ఇప్పటికే జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నవారిని కదుపుతారా? ఇంతకీ ఏంటా జిల్లా? ఈసారి కేబినెట్లో చోటు కోసం నేతలు గట్టి ప్రయత్నాలు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తామని మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో చెప్పారు ఏపీ సీఎం జగన్.…
వైసీపీ ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారా? వెనకా ముందు ఆలోచించకుండా నోటికి పని చెబుతున్నారా? ఓ ఎమ్మెల్యే కీలకమైన ఒక సామాజికవర్గాన్ని తాగుబోతులని కించపరిచారు. మరో ఎమ్మెల్యే ఏకంగా తమ నాయకుడు ప్రవేశపెట్టిన పథకాన్నే అపహాస్యం చేసి.. ప్రత్యర్థులకు బోల్డంత కంటెంట్ ఇచ్చారు. నేతల ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారిందా? కాపు సామాజికవర్గంపై అంబటి అనుచిత వ్యాఖ్యలు ఎంత తోస్తే అంత.. పద్ధతీ పాడు లేకుండా మాట్లాడేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. కావడానికి సీనియర్ నాయకులే అయినప్పటికీ పార్టీని..…
కొత్త ఎమ్మెల్సీల ఎంపిక తర్వాత ఆ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుకు మరోసారి తెరలేచింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలు కీలక పదవుల్లో ఉండటంతో రాజకీయం మూడుముక్కలాటలా మారిందా?. వారసులను రంగంలోకి దించేలా ఒకే బరిపై ముగ్గురు గురిపెట్టారా?. వారేవరో ఈ స్టోరీలో చూద్దాం. ముగ్గురు నేతలు మూడు కీలకపదవుల్లో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రిగా ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి లేని వివాదాన్ని తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్రాల అధికార పార్టీ లు ఈ రాజకీయ నాటకంలో భాగస్వాములయ్యాయు. కానీ బీజేపీ పై విమర్శలు, నిందలు వేస్తున్నారు. ఖచ్చితంగా అన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మంత్రులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఏలాంటి అనుమతులు లేకండానే ఎన్నో ప్రాజెక్టు…
ఆ జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధుల ఆరాటం ఒక్కటే. ఎమ్మెల్సీ మాకు కావాలంటే మాకు కావాలని ట్రై చేస్తున్నారు. గతంలో చేసిన త్యాగాలు.. ప్రస్తుతం తమ పొజిషన్.. ఫ్యూచర్లో ఎదురయ్యే సమస్యలు ఏకరవు పెడుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట. జిల్లా కేంద్రం నుంచి విజయవాడకు ఎక్కని వాహనం.. దిగని వాహనం లేదన్నట్టు క్యూ కడుతున్నారట. ఎవరా నాయకులు? పార్టీ పెద్దలు వారికిచ్చిన హామీలేంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం కర్చీఫ్ అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ఎమ్మెల్సీ పదవి…
పలాసలో రాజకీయం సలసలా కాగుతోంది. మంత్రి.. విపక్షపార్టీ ఎంపీ ఇద్దరూ ఒక్కచోటే ఫోకస్ పెట్టడంతో హీట్ పెరిగింది. దూకుడుగా వెళ్తున్నారు. అక్కడేం జరుగుతుందా అని జిల్లా అంతా చూస్తున్న పరిస్థితి. ఇంతకీ ఎవరా నాయకులు? పలాస పొలిటికల్ స్క్రిన్పై మారుతున్న రంగులేంటి? పలాసలో మంత్రి వర్సెస్ టీడీపీ ఎంపీ! పేరుకి వెనకబడిన ప్రాంతమే అయినప్పటికీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హీటు పుట్టిస్తూనే ఉంటాయి. నాయకుల మధ్య సాగే మాటలయుద్ధం రాష్ట్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో…