పొలిటికల్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ కామన్. అభిమానులు బూతులు తిట్టుకోవడం ఇంకా కామన్. ఇవి శ్రుతిమించి పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు రూటు మార్చేశారట. దానిపైనే ఇప్పుడు రాజకీయ.. పోలీస్వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎన్నికల్లో సోషల్ మీడియా పోస్టింగ్లకే డిమాండ్ఎదుటివారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కామెంట్స్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ వినియోగం పెరిగిన తర్వాత రాజకీయ పార్టీల…
ఒకప్పుడు ఆయా నియోజకవర్గాల్లో వారంతా కింగ్లు. రాజకీయాల్లో చక్రం తిప్పారు కూడా. పరిస్థితులు మారడంతో మరొకరి గెలుపు కోసం పనిచెయ్యాల్సి వచ్చింది. చెప్పిన పని చెప్పినట్లు పూర్తి చేశారు. గెలిచినవారు మాత్రం వారిని పట్టించుకోవడం మానేశారట. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథా? భవిష్యత్ బాగుంటుందని గెలుపునకు కృషి చేశారుఎన్నికల్లో కలిసి తిరిగిన వారిని దూరం పెట్టిన ఎమ్మెల్యేలు! రెండేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ సునామీ సృష్టించింది. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో కూడా…
ప్రతిపక్ష టీడీపీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేయడం అలవాటు చేసుకోవాలి అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు కానీ అర్ధంపర్ధం లేకుండా తలాతోక లేకుండా విమర్శలు చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఇమేజ్ పోతుంది … మీపార్టీలే ఉనికి కోల్పోతాయి అని తెలిపారు. రాజకీయాలకు అలవాటుపడిన ప్రతిపక్షానికి సంక్షేమం అవసరం లేదు. మీరు ప్రశ్నిస్తే ప్రజలు మాకెందుకు అధికారమిచ్చారో పునఃసమీక్ష చేసుకోవాలి అని పేర్కొన్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఆయన పేరు ఖరారు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవరు? అధికార పార్టీకి చెందిన నాయకుడే ప్రత్యర్థులకు లీకులు ఇచ్చి రచ్చ చేశారా? గవర్నర్ దగ్గర ఫైల్ క్లియరైనా వైసీపీ వర్గాల్లో ఈ టాపిక్ హాట్ హాట్గా మారింది. ఇంతకీ అడ్డుపుల్ల వేయడానికి చూసింది ఎవరు? విభేదాల వల్లే తోటకు పదవికి రాకుండా అడ్డుకునే యత్నం! తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విబేధాలు ఎప్పుడు గరం గరంగా ఉంటాయి. కీలక నాయకులంతా…
రాజకీయపార్టీలకు ఎన్నికలప్పుడు సామాజిక సమీకరణాలు గుర్తుకురావడం కామన్. ఓట్ల ఆధారంగా టిక్కెట్లు, హామీలు ఇస్తుంటాయి. అధికారపార్టీ మూడేళ్ల ముందు నుంచే అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఓ వర్గానికి దగ్గరవుతోంది. పదవుల్లో ప్రాధాన్యం ఇస్తోంది. ఇంతకీ అధికారపార్టీ లెక్క పక్కాయేనా..!? అనుకున్న బెనిఫిట్ దక్కుతుందా…!? మిగిలిన వర్గాల మాటేంటి..!!. కాపు, యాదవ, వెలమ, గవర, మత్స్యకారులు కీలకంవైసీపీకి పట్టుచిక్కని సిటీలోని నాలుగు స్థానాలు విశాఖజిల్లా రాజకీయాలు సామాజిక సమీకరణాలు చుట్టూ తిరగడం కొత్తేమీ కాదు. ఇక్కడ ఓటర్లు,…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇప్పుడు లోక్సభ స్పీకర్ చేతిలో ఉంది.. ఓ వైపు వైసీపీ సభ్యులు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు చేస్తుంటే.. మరోవైపు.. వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవద్దు అంటూ రఘురామ.. స్పీకర్ను కోరారు.. ఈ పరిణామాలపై స్పందించిన వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు తప్పవని..…
నెల్లూరును రెండు మూడు సంవత్సరాల్లో మార్చేస్తానని చెప్పాను.. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాను అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఐదారు వందల కోట్లు గ్రాంట్ రూపంలో తీసుకొని వచ్చాము. 100 కోట్లతో తో పెన్నా నది పై ఇంకో బ్రిడ్జి వస్తుంది ట్రాఫిక్ సమస్య మొత్తం తీరిపోతుంది. నేను ఎటువంటి పనులు చేశానో నెల్లూరు ప్రజలకు తెలుసు. సర్వేపల్లి కాలువ పక్కన 1,250 ఇళ్ళు ఉన్నాయి… అందులో 4,5 ఇళ్ల కే ప్రమాదం ఉంది… అందరికీ అండగా…
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో…
ఆనందయ్య ఆయుర్వేదం మందు చారిత్రాత్మక ఘటనగా మారింది అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందును అమ్ముకోవాలని కుట్రలు మొదలైనాయి. childeal.com వెబ్ సైట్ ను godaddy నుంచి శ్రేశిత టెక్మాలజీ వారు కొన్నారు. శ్రేశిత టెక్మాలజీ డైరెక్టర్లు వైసీపీ వారే అన్నారు. మూడు మందులను ఒక్కోక్క రేటు చొప్పున అమ్మాలని childeal.com లో పెట్టారు. మందులను 167 రూపాయలకు అమ్మాలని ఆన్ లైన్ లో పెట్టారు. మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదు.…