తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని బరిలో దించాలన్నది ఆ ఎంపీ ఆలోచన. ఇందుకోసం ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బుసలు కొడుతున్నారట. ఇది కాస్తా గుప్పుమనడంతో రెండువర్గాల మధ్య వార్ ఓ రేంజ్‌లోకి చేరుకుంది. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం.
తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ!
Also Read
రాజకీయాల్లో తండ్రి కీలక స్థానంలో ఉంటే.. తనయులు ఆయన్ని అనుసరించడం కామన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా పాలిటిక్స్‌లో వారసులకు ఓనమాలు దిద్దిస్తారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారట. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల ద్వారా తెరమీదకు తెచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఎంపీగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో కాకుండా.. కుమారుడి కోసం ఇంకో స్థానాన్ని ఎంపిక చేసుకోవడంతో ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గిద్దలూరులో మాగుంట తనయుడు రాఘవరెడ్డి పర్యటనలు
అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి వారసత్వంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు కాంగ్రెస్.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. జనంలో క్రేజ్ ఉన్నప్పుడే వారసుడు రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని గిద్దలూరు అసెంబ్లీలో తరచుగా చక్కర్లు కొట్టిస్తున్నారట. 2019 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో మాగుంటకి భారీ మెజారిటీ రావడం.. తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆయన గిద్దలూరుపై కన్నేశారని వైసీపీలో టాక్. దీంతో మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఏదో ఒక కార్యక్రమం పేరుతో గిద్దలూరులో తరచుగా పర్యటిస్తున్నారట.
రాఘవరెడ్డి టూర్లపై ఎమ్మెల్యే రాంబాబు గుర్రు
గిద్దలూరులో వైసీపీ నుంచి అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా సొంత పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోట.. రాంబాబుకు చెప్పకుండానే రాఘవరెడ్డి పర్యటనలు సాగుతున్నట్టు సమాచారం. అంతేకాదు.. కుమారుడి కోసం నియోజకవర్గంలో సొంతంగా ఒక వర్గాన్ని మాగుంట సిద్ధం చేశారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి తాచుపాములా బుస కొడుతున్నారట ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఎంపీ తనయుడు పర్యటనలకు వెళ్లొద్దని.. అనుచరులకు, అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారట ఎమ్మెల్యే. వైసీపీ ముఖ్య నేతలకు కూడా గిద్దలూరులో ఎంపీ మాగుంట చేస్తున్న పాలిటిక్స్‌పై రాంబాబు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
గిద్దలూరులో రెండువర్గాల మధ్య ఆధిపత్యపోరు!
గిద్దలూరులో ప్రస్తుతం వైసీపీ రాజకీయాలు ఎంపీ మాగుంట వర్సెస్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నట్టుగా మారాయి. రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయట. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా ఈ ఆధిపత్య పోరు ఏ స్థాయికి వెళ్తుందో.. ఎటు దారితీస్తుందో తెలియక కేడర్ ఆందోళన చెందుతుందట. రెండు వర్గాల మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా ఉంది. ఇద్దరూ బలమైన నాయకులే కావడంతో వారి వర్గాలు సైతం వెనక్కి తగ్గేలా లేవు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.. ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
- Tags
- MP Magunta
- off the record
- ycp
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!