సీదిరి అప్పలరాజు. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి. ఇంఛార్జ్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టాక.. జిల్లా సమావేశాలలో ఆయన తీరు ప్రశ్నగా మారింది. అధికారులను ఇరుకున పెడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు చర్చగా మారుతున్నాయి. తాను స్పెషల్‌గా కనిపించాలనో ఏమో ప్రతి చిన్న విషయానికీ గంటల తరబడి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారట. ఎవరైనా అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతుంటే.. ఐ నో ఎవ్రీథింగ్.. ప్లీజ్ సిట్ డౌన్.. అని ఇంగ్లీష్‌లో ఏకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నట్టు చెవులు…
కోనసీమ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి కుడుపూడి చిట్టాబ్బాయి వర్థంతి సభలో జరిగిన పరిణామాల తర్వాత రాజకీయం వాడీవాడీగా ఉంది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అధికారపార్టీలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చుని కృతజ్ఞతలు తెలియజేయడం మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన కొందరికి రుచించలేదు. వైసీపీలోనే ఉన్న ఆ…
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. తెలుగు రాష్ట్రాల్లోని వెనకబడిన తరగతులకు.. రాజకీయ పార్టీలకు ఆయన సుపరిచితం. అలాంటి నాయకుడు ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో చర్చగా మారారు. దానికి కారణం ఆయన్ను రాజ్యసభకు వైసీపీ ఎంపిక చేయడమే. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆర్ కృష్ణయ్యకు ఇస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన తాడేపల్లిలో కనిపించారు. వైసీపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీసీల సంక్షేమం .. హక్కుల సాధన కోసం…
ఏపీలో మూడేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఈ రెండేళ్లూ పార్టీతోపాటు నేతలు ప్రజల్లోనే ఉండేలా ప్రొగ్రామ్‌ను నిర్దేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఇంటింటికీ తిరిగి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తిరగాల్సి ఉంటుంది. ఒక్కో సచివాలయ పరిధిలో రెండు రోజులు పర్యటించాలి. వలంటీర్లతోపాటు.. సచివాలయ సిబ్బంది వారి వెంటే ఉండాలి. అధినేత ఆదేశించగానే మెజారిటీ…
బూతులు మాట్లాడితేనే నేతలవుతారా?అధినేతల మెప్పుకోసం అంతగా దిగజారాలా?తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు ఇలా ఎందుకు తయారైంది?రేపటి తరానికి ఇవాళ లీడర్లు ఏం మెసేజ్ ఇస్తున్నారు? భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థలు సమాజానికి ఏం మేలు చేస్తాయి?చట్ట సభల్లో మాటలు అదుపు తప్పితే జనం నోట మంచిమాటలెలా వస్తాయి? అడ్డూ అదుపు లేకుండా పోతోంది.ఏం మాట్లాడుతున్నారో, ఏం ట్వీట్ చేస్తున్నారో సోయి లేకుండా పోతోంది. ఎలాపడితే అలా నోరుజారుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేత అయితే చాలు.. ఎంత మాట…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ పొలిటికల్ హీట్‌తో.. గ్రూపు రాజకీయాలతో రచ్చరచ్చగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక రగడ ఇక్కడ కామన్. ఇలాంటి క్రమంలో రాజకీయాల్లో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం పది అడుగు వేయలనే ఆలోచనలో టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ వ్యూహం మార్చారట. మొన్నటిదాకా సైలెంట్‌గా చక్రం తిప్పిన ఆయన.. రోజాకు మంత్రి పదవి వచ్చాక ప్లాన్ బీ అమలులోకి తెచ్చారట. జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్‌లో…
రాష్ట్రంలో మంత్రి పదవి ఆశించిన నేతలకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జిల్లా అధ్యక్షులు మీరే.. పార్టీ బాధ్యతలు మీవే.. నడిపించేది.. గెలిపించేది మీరే అనే క్లారిటీ ఇచ్చారు. మంత్రులకంటే మీరే ఎక్కువ అని కూడా సాక్షాత్తూ సీఎం చెప్పారు కూడా. అయితే ఇది పదవి అనుకోవాలా.. లేక కొత్త సమస్యలు తలకెత్తుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడ్డారు పార్టీ పదవుల్లోకి వచ్చిన నేతలు. కొందరు నాయకులు మాత్రం తమ ముందున్న సవాళ్లను లెక్క చేయకుండా ఉత్సాహంగా…
TJR సుధాకర్‌బాబు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి YCP MLAగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో.. మొదట్లో ఎమ్మెల్యేకు లోకల్ పార్టీ కేడర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు కనిపించినా.. తర్వాత గ్యాప్ వచ్చేసింది. నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు, చీమకుర్తి మండలాల్లో ఈ గ్యాప్ మరీ ఎక్కువగా ఉందట. ఈ అంశాన్ని గుర్తించినా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదట సుధాకర్‌బాబు. దాంతో విభేదాలు కోల్డ్‌వార్‌గా మారిపోయినట్టు టాక్. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు…
మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కకనినేతల అసంతృప్తి ఇంకా చల్లారినట్టు కనిపంచడంలేదు.. ముఖ్యంగా పశ్చిమగోదావరిజిల్లా నేతల్లో అసంతృప్తి సెగ పొగలుగక్కుతోంది. చాపకింద నీరులా వ్యాపించి ఓట్లేసిన జనంలో దృష్టిలో చులకన చేస్తోంది. తాజాగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యవహరంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. భీమవరంలో వైసీపీ జిల్లా పార్టీ మీటింగ్ రసాభాసగా మారడం మంత్రి వర్గవిస్తరణలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు చోటు దక్కకపోవడం ఎంతటి అసంతృప్తిని మిగిల్చిందో బయటపెట్టింది. పార్టీని మరింత…
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వైసిపి సంక్షోభంలో పడింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసిపిలో ప్రాధాన్యత ఇవ్వడం, నియోజకవర్గ వైసిపి శ్రేణులకు మింగుడు పడటంలేదు. వైసిపికి రాజోలు నియోజకవర్గంలో కో – ఆర్డినేటర్ గా పెదపాటి అమ్మాజీ, మాజీ కో – ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు లను ప్రక్కన పెట్టి ఎమ్మెల్యే రాపాకకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో వైసిపి ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు డీలా పడ్డారు. ఇటీవల అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా…