రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 10న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపింది. 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది ఎంపీల పదవీ కాలం జూన్ 21 నుంచి ఆగస్టు 1లోపు పూర్తి కానుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఉండగా.. ఏపీలో నాలుగు స్థానాలు ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 11 రాజ్యసభ స్థానాలు…
ఆరు నియోజకవర్గాలు కలిగిన విశాఖపట్టణంజిల్లా ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువు పట్టు. సంస్ధాగతంగా పార్టీల బలోపేతంపై టీడీపీ, వైసీపీ ఫోకస్ పెంచాయి. సోషల్ ఇంజనీరింగ్‌లో పది అడుగులు ముందేవున్న వైసీపీ.. కీలకమైన జిల్లా అధ్యక్ష పదవిలో మార్పు చేసింది. మూడేళ్లు మంత్రిగా ఉన్న భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. తొలిసారి పార్టీని నడిపించే అవకాశం లభించడంతో అవంతి సైతం ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నారు. కానీ, క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితులు అవంతికి ఏ మాత్రం కొరుకుడుపడ్డం లేదనేది…
డీకే ఆదికేశవులు…మాజీ ఎంపీ .. టీటీడీ మాజీ ఛైర్మన్. చిత్తూరు జిల్లాలో వ్యాపార పరంగా, రాజకీయంగాను పెద్ద కుటుంబం. ఆర్థికంగానూ బలమైన ఫ్యామిలీ. చిత్తూరుతోపాటు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో డీకే కుటుంబానికి పట్టు ఉండేది. 2004లో టిడిపి తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసిన ఆదికేశవులు.. తర్వాత కాంగ్రెస్‌లో చేరి TTD ఛైర్మన్ అయ్యారు. డీకే శ్రీనివాసులు 2009లో పీఆర్పీ తరపున రాజంపేట లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత డీకే కుటుంబం మరోసారి టీడీపీకి చేరువైంది.…
టీడీపీకి గతంలో కంచుకోటగా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా.. ప్రస్తుతం మంచుకోటగా మారి.. క్రమంగా పార్టీ ఉనికి కోల్పోతున్న దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను గంపగుత్తగా వైసీపీ కైవశం చేసుకున్నప్పుడే ఈ విషయం తేటతెల్లమైంది. అప్పటితో పని అయిపోయిందని అనుకున్నారో.. పార్టీకి ఊపిరి లూదడం తమకు సంబంధం లేదని భావించారో ఏమో ప్రస్తుతం నాయకులతోపాటు పార్టీ కూడా పొలిటికల్ తెరపై నుంచి కననుమరుగయ్యే ప్రమాదం దాపురించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ…
ఎమ్మెల్యే తలారి వైఖరిపైనే ఆరోపణలు గోపాలపురం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దగా రాజకీయ అలికిడి లేని నియోజకవర్గం. ఇటీవల జికొత్తపల్లి గ్రామంలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యతో ఒక్కసారిగా అటెన్షన్ తీసుకొచ్చింది గోపాలపురం. వైసీపీలోని గ్రూప్‌వార్ హత్యకు కారణం ఒక సంచలనమైతే.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్థానికులు దాడి చేయడం కలకలం రేపింది. దీంతో గోపాలపురంలో ఏం జరుగుతుంది? అక్కడ అధికారపార్టీలో వర్గపోరు చంపుకొనే స్థాయిలో ఉందా? అయితే దానికి కారణం ఎవరు?…
చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు పార్టీ మార్పుపై చాలాకాలం నుంచి వదంతులు షికారు చేస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన పాలేటి.. పలు పార్టీలు మారి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్‌తో కలసి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎవరికి మద్దతుగా నిలుస్తారో చెప్పలేమన్నది అభిమానుల మాట. ఆ మధ్య కొంతకాలం ఎమ్మెల్యే బలరామ్‌తో కొంత గ్యాప్ వచ్చినా మళ్లీ…
లావు శ్రీకృష్ణదేవరాయులు. నరసరావుపేట వైసీపీ ఎంపీ. ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల చుట్టూ నరసరావుపేట వైసీపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఒకరు ఎగ్జిట్ అయ్యి.. ఇంకొకరు ఎంట్రీ ఇస్తారనే చర్చ అధికారపార్టీ వర్గాల్లో ఊపందుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేంద్రంగా జరుగుతున్న ప్రచారం.. చర్చలు మరెంతో ఉత్కంఠ రేపుతోంది. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 2009లో నరసరావుపేట టీడీపీ ఎంపీ. 2014కు వచ్చేసరికి గుంటూరు పశ్చిమ నుంచి…
గ్రాఫ్ పడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ అని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పేయడంతో.. గోదావరి జిల్లాల్లో ఆ అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు టికెట్ వస్తుంది? ఎవరికి రాదు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు వైసీపీ శ్రేణులు కలిసినా ఇదే చర్చ. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేలపై కొందరు వ్యతిరేక ప్రచారాలు మొదలు పెట్టేస్తున్నారట. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో…
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. టీడీపీ అంచనాలకు అందని సెగ్మెంట్లలో ఇదొకటి. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిస్తే. తర్వాత వైసీపీ పాగా వేసింది. గతంలో టీడీపీ నుంచి బసప్ప, రంగయ్య, మసాలా ఈరన్నలు ఎమ్మెల్యేలుగా చేశారు. 2009 వరకు ఆలూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అప్పట్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి బాగా పట్టు ఉండేది. దాంతో టీడీపీ ఎత్తులు పారేవి కాదు. కాంగ్రెస్ బలహీన పడినా టీడీపీలో గ్రూపు రాజకీయాలు సైకిల్‌ను ఎదగనివ్వలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ…
టీడీపీ నేతలకు ఎవరి పార్టీ ఆఫీసు వాళ్లదే నూకసాని బాలాజీ. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన తర్వాత పసుపు కండువా కప్పుకొన్నారు. వైసీపీలోనూ ఆయనకు జిల్లా అధ్యక్షుడి హోదా కట్టబెట్టారు. జడ్పీ చైర్మన్ అభ్యర్దిగా ప్రకటించినా.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యం కాక మరొకరు ఆ పోస్టును తన్నుకు పోయారు. చేసేదేమీ లేక టీడీపీలో చేరిపోయారు నూకసాని. అప్పటి నుంచి టీడీపీలో ఆయనకు సముచిత స్ధానమే దక్కింది. కొంతకాలానికి…