తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు.
Read Also: Ponnam Prabhakar: రేపటి నుండి టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మహిళల్లో చాలా మంది రక్త హీనతతో బాధపడుతున్నారని… పౌష్టికాహారం లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి అంగన్వాడీలలో పిల్లలకు నర్సరీ క్లాస్లను కూడా ప్రారంభిస్తామన్నారు. నగరంలో వలస కూలీలు ఉండే ప్రాంతాల్లో అంగన్వాడీ మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి, వారి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినిలకు సానిటరీ న్యాప్కిన్ కిట్స్లను అందిస్తామని తెలిపారు.
Read Also: US Intel Report: భారత్-చైనా మధ్య సాయుధ ఘర్షణ!.. అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
90 రోజుల్లో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందని… రాబోయే రోజుల్లో మరిన్ని పధకాలను అమలు చేసి, ప్రజలకు చేరువవుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డగా విప్లవ ఉద్యమంలోకి వెళ్లి గన్ను పట్టానని.. ఉద్యమం నుండి బయటకు వచ్చాక ప్రజాసేవ చేసేందుకు తనకు ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించిన మంత్రి… వారికి లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకంతో సత్కరించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారిణి వేసిన దరువుకు దివ్యంగురాలు అయిన భాగ్య అనే విద్యార్థితో కలిసి మంత్రి డ్యాన్స్ చేశారు.