Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ దేశ మహిళలపై ప్రశంసలు కురిపించారు. దేశంలో జననాల రేటు పెంచేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల పలుమార్లు రష్యా అధినేత మహిళలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మాతృత్వం, ఆకర్షణ, అందం యొక్క బహుమతులను అందించినందుకు మహిళల్ని ప్రత్యేకంగా వారిని అభినందించారు. మార్చి 8 అనేది సోవియల్ సమయం నుంచి రష్యాలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా ఉంది. స్త్రీల గొప్పతనం గురించి వారి నైపుణ్యాల గురించి గొప్పగా చెప్పబడుతోంది.
Read Also: Bengaluru Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి కొత్త ఫోటోలను రిలీజ్ చేసిన ఎన్ఐఏ..
రష్యాలో కుటుంబం దాని అవసరాలు, ఆసక్తులపై దృష్టి కేంద్రీకరించడం మా సంపూర్ణ ప్రాధాన్యత అని పుతిన్ శుక్రవారం అన్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు, యువ తల్లిదండ్రులకు తాము అన్ని విధాల సాయం అందిస్తామని చెప్పారు. మహిళలు అనేక సంక్లిష్ట పనుల్ని చేపడుతున్నారని, త్వరగా, సమయానుకూలంగా అన్నింటిని చేయగల మీ సామర్థ్యంతో పురుషుల్ని ఆకట్టుకుంటున్నానని పుతిన్ అన్నారు. అన్ని సమయాల్లో మీరు మనోహరంగా ఉంటూనే సమస్యల్ని ఎదుర్కొంటున్నారని మెచ్చుకున్నారు.
రష్యాలో జననాల రేటు పెంచడానికి గత వారం పార్లమెంట్ వార్షిక ప్రసంగంలో పుతిన్ మాట్లాడుతూ.. పెద్ద కుటుంబాలు మన సమాజంలో జీవన తత్వశాస్త్రం, ప్రభుత్వ వ్యూహానికి ప్రమాణంగా మారాలి అని చెప్పారు. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలు మాకు గర్వకారణం అని అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో యుద్ధంలో పాల్గొంటున్న మహిళలు, సైనికుల కోసం ఎదురుచూస్తున్న మహిళలను ప్రశంసించారు.