వాడవాడలా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చట్టసభల్లో, అన్నిచోట్ల మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. మహిళల రిజర్వేషన్లు సాధించే విషయంలో నా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుంది.
Read Also: Sai Pallavi: ‘పుష్పరాజ్’ కోసం పది రోజులు కాల్ షీట్స్ ఇచ్చిన సాయి పల్లవి?
స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం వేళ మహిళా మణులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సృష్టిలో సగభాగం మహిళ, ప్రతీ మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం అని ట్వీట్ చేశారు పవన్.
సృష్టిలో సగభాగం మహిళ, ప్రతీ మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.#WomensDay#InternationalWomensDay#womenempowerment pic.twitter.com/45nMfAg6Is
— JanaSena Party (@JanaSenaParty) March 8, 2023
Read Also: IND VS AUS : అహ్మదాబాద్ టెస్టులో చరిత్ర సృష్టించనున్న రోహిత్