మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ.100 కూడా ఇవ్వరని.. అలాంటిది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.. లడ్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు.
మహిళలపై అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పుడే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. తాజాగా డీఎంకేను ఉద్దేశించి అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
JC Prabhakar Reddy: నిత్యం రాజకీయాలు మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు మహళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హౌస్ వైఫ్ అంటే అంతా సులభమైన పని కాదు అన్నారు జేసీ.. హౌస్ వైఫ్ అంటే అడ్మినిస్ట్రేటర్ అని అభివర్ణించారు. అయితే, సమాజానికి మేలు చేయాలి అనే మహిళలు ముందుకు రండి అంటూ ఆహ్వానించారు.. తాడిపత్రిలో అండర్ డ్రైనేజ్ లో వెనక ఉన్నాం.. ఎందుకంటే…
పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక సిద్ధం చేస్తున్నారు.. శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయబోతున్నారు పవన్ కల్యాణ్..
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఘాట్ రూట్లలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తింపు చెయ్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని గుర్తించారు.. సోమవారం ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు.. జీరో ఫేర్ టికెట్ ద్వారా మహిళలకు రూ.7 కోట్లకు పైగా ఆదా అయినట్టు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి.. 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం…
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రానుంది.. ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్‌కు బస్సులో రానున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సాయంత్రం 4 గంటలకి విజయవాడ బస్టాండ్ లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.. ఇక, ఆయా నియోజక వర్గాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు..
చిన్నాచితక మహిళా వ్యాపారులే అతని టార్గెట్ !! ముద్ర లోన్స్ పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలు చెప్పి.. నిండా ముంచుతున్నాడు. ఇలా మోసం చేసింది ఏ 10 మందినో.. వంద మందినో కాదు. ఏకంగా 500 మందిని మోసం చేశాడు. లక్షలు దండుకుని ఆస్తులు కూడగట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఐదేళ్ల తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. రోజుకో ప్రాంతంలో మారు వేషాల్లో తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. అమాయకంగా చేతులు కట్టుకుని నిల్చున్న…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. ముఖ్యంగా.. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న మహిళలకు శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం.. రేపు కేబినెట్ సమావేశంలో మహిళల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చర్చించబోతున్నారు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేయనుంది ప్రభుత్వం..
ఇంట్లో పని అని చెప్పి తనతో భారతి అనే మహిళ వ్యభిచారం చేయించిందని ఆవేదన వెలిబుచ్చింది ఒక మహిళ.. అమ్మాయిలను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదిస్తుందని, తాను పారిపోయే ప్రయత్నం చేస్తే నన్ను, నా బిడ్డను చంపుతానని బెదిరించిందని అంటుంది..