Peddapuram: పెద్దాపురం అంటే వ్యభిచారానికి పెట్టింది పేరుగా చెప్పేవారు.. అయితే, కాల క్రమేనా పరిస్థితులు మారిపోయాయని.. ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారని చెబుతుంటారు.. అయితే, పెద్దాపురంలో వెలుగు చూసిన ఓ చీకటి బాగోతం ఒళ్లు గగ్గురుపరిచే విధంగా ఉంది.. ఇంట్లో పని చేయాలి.. నెలకు రూ.15 వేలు ఇస్తానంటూ.. ఓ యువతిని తీసుకెళ్లిన ఓ మాయలేడి.. బలవంతంగా ఆ యువతిని వ్యభిచారం రొంపిలోకి దింపింది.. గర్భందాల్చి.. ప్రసవించిన తర్వాత కూడా.. ఆ యువతిని బంధించి అదేపని చేయించింది.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆ యువతి సంచలన విషయాలు బయటపెట్టింది..
Read Also: Tragedy : మియాపూర్ లో విషాదం.. భవనం పై నుండి దూకి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఇంట్లో పని అని చెప్పి తనతో భారతి అనే మహిళ వ్యభిచారం చేయించిందని ఆవేదన వెలిబుచ్చింది ఒక మహిళ.. అమ్మాయిలను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదిస్తుందని, తాను పారిపోయే ప్రయత్నం చేస్తే నన్ను, నా బిడ్డను చంపుతానని బెదిరించిందని అంటుంది.. తనకు ప్రాణహాని ఉందని, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని కుటుంబ సభ్యులు కూడా ఇంటికి రానివ్వడం లేదని, తనతో ఖాళీ చెక్‌లు, బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుందని, భారతితో ఎప్పటికైనా తనకు ప్రమాదం ఉందని.. తనకు రక్షణ కల్పించాలని కోరుతుంది.. అంతేకాదు, వ్యభిచార గృహలు నిర్వహించడానికి పోలీసులు సహకారం ఉందని.. ఇద్దరు మాత్రమే బయటపడ్డారు.. ప్రతినెల డబ్బులు తీసుకునే వాళ్లు కూడా ఉన్నారని వెల్లడించింది.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో బాధితురాలు బయటపెట్టిన సంచలన విషయాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..