JC Prabhakar Reddy: నిత్యం రాజకీయాలు మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు మహళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హౌస్ వైఫ్ అంటే అంతా సులభమైన పని కాదు అన్నారు జేసీ.. హౌస్ వైఫ్ అంటే అడ్మినిస్ట్రేటర్ అని అభివర్ణించారు. అయితే, సమాజానికి మేలు చేయాలి అనే మహిళలు ముందుకు రండి అంటూ ఆహ్వానించారు.. తాడిపత్రిలో అండర్ డ్రైనేజ్ లో వెనక ఉన్నాం.. ఎందుకంటే అండర్ డ్రైనేజ్ లో వ్యర్థ పదార్థాలు వేయడమే కారణం అన్నారు.. మహిళల సహాయ సహకారాలు మాకు కావాలి అన్నారు.. సోషల్ వర్క్ చేయడానికి ఆడపిల్లలు ముందుకు రావాలని సూచించారు.. ఒక రోజూ నేను మీటింగ్ ఏర్పాటు చేస్తా.. తాడిపత్రి బాగుండాలి అనే వాళ్లు ముందుకు రండి.. పరకపట్టాలి అంటే ధైర్యం ఉండాలన్నారు.. ఇక, త్వరలో నెలకు రెండు లక్షలు ఇచ్చిన పని చేసే వాళ్లు ఉండరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మంచి పనులు చేసి మీకు గుర్తింపు తెచ్చుకోండి అంటూ సూచించారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి..
Read Also: Mammootty: మమ్ముట్టి హెల్త్ అప్‌డేట్..