Maharashtra: మహిళలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. ఎన్నికల ప్రసంగంలో ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు
- మంగళవారం మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు
- భర్తలు రూ.100 కూడా ఇవ్వరు
- అలాంటిది ఫడ్నవిస్ మహిళలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారు
- మహిళలు ఫడ్నవిస్ రుణం తీర్చుకోవాలన్న మంత్రి జయకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ.100 కూడా ఇవ్వరని.. అలాంటిది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.. లడ్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి మహిళ ఫడ్నవిస్‌కు కృతజ్ఞతగా బీజేపీకి ఓటువేసి విధేయత చూపించాలని కోరారు. ఓటు వేసేటప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని మహిళా ఓటర్లను కోరారు.
ఇది కూడా చదవండి: Pinarayi Vijayan: కేరళ సీఎంకు ఈడీ నోటీసులు.. దేనికోసమంటే..!
Also Read
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
డిసెంబర్ 2న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ మాట్లాడుతూ… స్థానిక ఎన్నికల సమయంలో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. కానీ ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే రూ. 1,500 స్టైఫండ్‌ను గుర్తుంచుకోవాలని సూచించారు. ఫడ్నవిస్ అధికారంలో లేకపోతే మీ అకౌంట్లు డబ్బులు పడేవా? అని అడిగారు. అందుకే ఫడ్నవిస్ పట్ల విధేయత చూపించాలని విజ్ఞప్తి చేశారు. రక్షా బంధన్ సమయంలో కూడా సోదరులు తమ సోదరీమణులకు డబ్బు బహుమతిగా ఇచ్చేటప్పుడు వారి భార్యల అనుమతి తీసుకుంటారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మహాయుతి మిత్రులపై కూడా మంత్రి విమర్శలు చేశారు. పాలక వర్గంలోని కొన్ని పార్టీలు ఖజానా తమ దగ్గర ఉందని చెప్పుకుంటున్నప్పటికీ తుది ఆమోదం బీజేపీదేనని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్‌ను అభినందించిన మోడీ
246 మునిసిపల్ కౌన్సిల్‌లు, 42 నగర పంచాయతీలకు డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 1.07 కోట్లకు పైగా ఓటర్లు 6859 మంది సభ్యులను, 288 మునిసిపల్ అధ్యక్షులను ఎన్నుకుంటారు.
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!