మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం వచ్చింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏకాభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎలా అమలుచేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నా.. అమలు చేయాల్సిందే అనే క్లారిటీ అయితే పూర్తిగా కనిపిస్తోంది.
Minister Savitha: భారతదేశ మహిళలను ఇతర దేశాలలో కూడా గౌరవిస్తారు అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత సవిత తెలిపారు. కానీ, మహిళా రైతులు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్లినప్పుడు ఎలా అసభ్యకరంగా మాట్లాడారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నితీష్ కుమార్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని సీఎం ఎస్పీ తెలిపారు.…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి, దాడి చేసిన అమానవీయ ఘటన కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో వెలుగు చూసింది. నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక ఊరు విడిచి పెట్టి వెళ్లిపోగా.. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ..…
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర్ల సహాయంతో దొర్నిపాడు మండలం అర్జునపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.
విశాఖపట్నంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. Also Read: Coronavirus: కరోనా వైరస్ పట్ల…
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిగి మండలం ధనాపురం సమీపంలో ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొడికొండ సిరా 544 జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. Also Read:Pawan Kalyan: మార్క్ శంకర్ తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించబోతోంది. మహిళలకు అండగా నిలిచి వారి అభివృద్ధికి బాసటగా నిలిచేందుకు పలు పథకాలను ప్రారంభించనున్నది. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అద్భుతమైన పథకాలను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది. ఇంతకీ ఆ పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. Also Read:Alia Bhatt: ఆలియా భట్…